Russia Military : సైన్యంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే 15ఏళ్ల జైలు శిక్ష, రష్యా కొత్త చట్టం

ర‌ష్యా సైన్యంపై(Russia Military) ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారికి 15 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు జ‌రిమానా కూడా విధిస్తారు.

Russia Military : సైన్యంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే 15ఏళ్ల జైలు శిక్ష, రష్యా కొత్త చట్టం

Russia Military (1)

Updated On : March 4, 2022 / 4:42 PM IST

Russia Military : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వరుసగా 9వ రోజూ యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. యుక్రెయిన్ కూడా ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాలపై ఎదురు దాడి చేస్తోంది. కాగా, ర‌ష్యా-యుక్రెయిన్ల మధ్య జ‌రుగుతున్న యుద్ధం.. ఆ దేశాల్లో కొత్త చ‌ట్టాల అమ‌లుకు దారితీసింది. ర‌ష్యా దాడుల‌కు ప్ర‌తీకార చ‌ర్య‌గా త‌మ దేశంలో ఉంటున్న ర‌ష్యన్ల ఆస్తుల‌ను సీజ్ చేసేందుకు గురువారం యుక్రెయిన్ కీల‌క చ‌ట్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రష్యా సైతం అలాంటి చట్టం ఒకటి తీసుకొచ్చింది.

సైన్యంపై త‌ప్పుడు ప్ర‌చారం చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉద్దేశించిన ఆ చ‌ట్టానికి శుక్ర‌వారం నాడు ర‌ష్యా పార్ల‌మెంటు ఆమోద ముద్ర వేసింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం ర‌ష్యా సాయుధ ద‌ళాల‌పై (Russia Military) త‌ప్పుడు ప్ర‌చారం వ్యాప్తి చేయ‌డాన్ని జైలు శిక్ష విధించ‌ద‌గిన నేరంగా ప‌రిగ‌ణిస్తారు. ర‌ష్యా సైన్యంపై ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారికి 15 ఏళ్ల జైలు శిక్ష‌తో పాటు జ‌రిమానా కూడా విధిస్తారు. ఈ మేర‌కు ర‌ష్యా పార్ల‌మెంటులోని దిగువ స‌భ ఈ చ‌ట్టానికి ఆమోద ముద్ర వేసింది.

Russia ukraine war : ‘బలి చేయటానికే ట్రైనింగ్‌లో ఉన్న మమ్మల్ని యుద్ధానికి పంపారు’ రష్యా సైనికుల ఆవేదన

రష్యా బలగాల దాడిలో యుక్రెయిన్ కు తీవ్ర నష్టం జరుగుతోంది. అయినప్పటికి యుక్రెయిన్ కూడా అంతే స్థాయిలో విరుచుకుపడుతోంది. రష్యా సైన్యాన్ని, వారి యుద్ధ వాహనాలను ధ్వంసం చేస్తోంది. ఇప్పటిదాకా యుక్రెయిన్ సైన్యం దాడిలో 9వేల 166 మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.

అంతేకాదు 251 రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని, 33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్లను కూల్చేశామని తెలిపింది. తమ దాడుల్లో రష్యాకు చెందిన 105 ఫిరంగులు, 939 సిబ్బందిని తరలించే వాహనాలు, 50 క్షిపణి లాంచర్లు, 2 పడవలు, 404 కార్లు, 60 ఇంధన ట్యాంకులు, 3 డ్రోన్లు, 18 యుద్ధ విమాన వినాశక మిసైల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని యుక్రెయిన్ రక్షణ శాఖ చెప్పింది.

యుక్రెయిన్ పై ర‌ష్యా సేనలు దాడులు తీవ్ర‌త‌రం చేశాయి. యుక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి ముందస్తుగానే అన్ని ర‌కాలుగా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకున్న రష్యా.. అమెరికా క్షిప‌ణులనూ భారీ మొత్తంలో ప్ర‌యోగిస్తోంది. యుక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Russia-Ukraine War : యుక్రెయిన్ లోని యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా..

వాటిలో 230 ఉక్రెయిన్ లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా, 150 రష్యా భూభాగం నుంచి, 70 బెలారస్ నుంచి, మ‌రికొన్నింటిని నల్ల సముద్రంలోని నౌకల ద్వారా ర‌ష్యా ప్రయోగించినట్లు తెలిపింది. వాటిని ఉక్రెయిన్ లోని క్షిపణి విధ్వంసక దళాలు ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేశాయ‌ని చెప్పింది. ర‌ష్యా సేన‌లు యుక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో దాడుల‌కు తెగ‌బ‌డుతూ దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఉత్తర ప్రాంతంలో మాత్రం ఎదురు దెబ్బ‌లు తింటున్నార‌ని అమెరికా తెలిపింది. ఆ ప్రాంతంలో యుక్రెయిన్ సేన‌లు బ‌లంగా ఉండ‌డంతో ప్రతిఘటన ఎదుర‌వుతోంద‌ని వివ‌రించింది.