Libya Migrants : వారం రోజుల వ్యవధిలో 160 మంది వలసదారులు మృతి

లిబియాలో బ్రతకలేక పొట్టచేతపట్టుకుని యూరోప్ దేశాలకు వలస వెళుతూ ప్రమాదానికి గురై వారం రోజుల వ్యవధిలో 160 మంది మృతి చెందారు.

Libya Migrants : వారం రోజుల వ్యవధిలో 160 మంది వలసదారులు మృతి

Libya Migrants

Updated On : December 22, 2021 / 11:16 AM IST

Libya Migrants : లిబియాలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. 2011 లిబియా నియంత ముఅమ్మర్ ఖడాఫీని హత్యచేసిన నాటి నుంచి ఆ దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని యూరోప్ దేశాలకు వలస వెళ్తున్నారు. మధ్యదరా సముద్రం గుండా వెళ్తున్న సమయంలో పడవలు మునిగి అనేక మంది శరణార్థులు ప్రాణాలు విడుస్తున్నారు. గత వారం లిబియాలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 160 మందికి పైగా మృత్యువాతపడ్డారని ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ విభాగం అధికారులు పేర్కొన్నారు.

చదవండి : Libya Boat Accident : ఘోర పడవ ప్రమాదం.. 57 మంది మృతి!

లిబియా తీరంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో 102 మంది మృత్యువాతపడ్డారని సమాచారం ఈ సంస్థ తెలిపింది. కనీసం ఎనిమిది మందిని రక్షించి ఒడ్డుకు చేర్చినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రతినిధి సఫా ఎంసెహ్లీ తెలిపారు. శనివారం జరిగిన మరో ప్రమాదం జరగ్గా లిబియా తీరరక్షక దళం కనీసం 62 మంది వలసదారుల మృతదేహాలను వెలికి తీసిందని, అదే రోజు కోస్ట్‌గార్డ్ మరో 210 మంది వలసదారులతో వెళ్తున్న పడవను అడ్డుకొని వారిని రక్షించారని వివరించారు. లిబియాలో నచివేత, పేదరికంతో యూరోప్ దేశాలకు వలసవెళ్తున్నారని తెలిపారు.

చదవండి : India’s Migrants : సొంతూళ్లకు పయనం, కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లు!

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం.. కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,500 మంది వరకు మరణించారని ఆమె వివరించారు. మరణించిన వారిలో 20 మంది మహిళలు 7 చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు సఫా ఎంసెహ్లీ.