ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య, 18ఏళ్లకే నూరేళ్లు

18-year-old TikTok star hangs: సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తమ టాలెంట్ తో అపారమైన పేరు, ప్రఖ్యాతలు గడిస్తున్నారు. ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. సెలబ్రిటీలుగా వెలిగిపోతున్నారు. కాగా, కొందరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించి సక్సెస్ అవుతుంటే.. మానసిక కారణాలతో, ఒత్తిళ్లతో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు మరికొందరు. ప్రముఖ టిక్ టాక్ స్టార్(TikTok Star) డజారియో(Dazhariaa Quint Noyes) రెండో కోవలోకి చేరింది. అనతి కాలంలోనే టిక్ టాక్ స్టార్ గా పాపులారిటీ సంపాదించిన డజారియా సడెన్ గా ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులతో పాటు ఫ్యాన్స్ ని విషాదంలోకి నెట్టేసింది.
అమెరికాలోని బ్యాటన్ రోగ్ కి చెందిన డజారియాకు టిక్ టాక్ లో 10.5లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏ వీడియో తీసినా దానికి లక్షల సంఖ్యలో లైకులు, షేర్లు వస్తాయి. కొద్ది రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న డజారియా హఠాత్తుగా గత సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని చనిపోయింది. ఆమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే. డజారియా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందని వారు వెల్లడించారు. ”ఇదే నా చివరి పోస్టు” అనే క్యాప్షన్ తో తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో లో ఓ వీడియో పెట్టిన డజారియా ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
డీ(Dee) అనే పేరుతో బాగా పాపులర్ అయ్యింది. ఆత్మహత్యకు ముందు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ వీడియో తీసింది. దాన్ని ఇన్ స్టా లో షేర్ చేసింది. ఇదే నా చివరి పోస్ట్ అని చెప్పింది. ఆ తర్వాత ఫ్యాన్స్ గుండెలు పగిలే వార్త బయటకు వచ్చింది. డజారియా పాపులర్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. టిక్ టాక్ లో ఆమెకు 10లక్షల మంది, ఇన్ స్టాలో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు య్యూటూబ్ లో కూడా బాగా పాపులర్. పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
అసలేం జరిగిందో డజారియా తండ్రి రహీమ్ అల్లా కన్నీటిపర్యంతం అవుతూ వివరించారు. ”ఫిబ్రవరి 8న నా కూతురు మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయింది. తను నాకు బెస్ట్ ఫ్రెండ్. నా చేతులతో తన పాడె మోయాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. నేను విదేశాల నుంచి వచ్చినప్పుడు నన్ను చూసి తను చాలా ఆనందించేంది. తను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి గురించి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన గురించి నాతో ఒక్కసారైనా చెప్పి ఉండాల్సింది. తను పడుతున్న వేదన గురించి మాతో ఒక్కసారి కూడా చెప్పకపోవడం చాలా బాధించింది. నేను ఇంటకి వచ్చానమ్మా. లేచి చూడు. నీ కోసం ఎదురుచూస్తున్నా. నాన్న నిన్ను ప్రేమిస్తాడు.”
డజారియా ఇక లేదు అనే వార్త తెలిసి ఫ్యాన్స్ షాక్ లో ఉండిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మేసేజ్ లు పెడుతున్నారు. నువ్వు మా ఫేవరెట్ టిక్ టాకర్, య్యూటూబర్ అని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావనే వార్త మా గుండెలను బద్దలు చేసింది అని వాపోయారు. ఈ షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పడుతుందని నెటిజన్లు అంటున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram