2024 US Presidential campaign: “సోవియట్”లాగే కమ్యూనిస్ట్ చైనా కాలగర్భంలో కలిసిపోతుంది: నిక్కీ హేలీ వార్నింగ్
చైనా నియంతృత్వ నేతలు ప్రపంచాన్ని "కమ్యూనిస్టు దౌర్జన్యం" పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారని నిక్కీ హేలీ విమర్శించారు. చైనాను అమెరికా మాత్రమే నిలువరించగలదని అన్నారు.

Nikki Haley
2024 US Presidential campaign: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన భారత సంతతి మహిళ, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ (51) చైనాపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, వార్నింగ్ ఇచ్చారు. సోవియట్ యూనియన్ లాగే కమ్యూనిస్ట్ చైనా కూడా కాల గర్భంలో కలిసిపోతుందని చెప్పారు. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిక్కీ హేలీ తొలి సారి తన మద్దతుదారులతో కలిసి సౌత్ కరోలినాలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు.
“అమెరికా సైనిక శక్తి మరింత పెరుగుతుంది.. ఎన్నడూలేనంత బలంగా తయారవుతుంది. అయితే, శక్తిమంతమైన మిలటరీ యుద్ధాన్ని ప్రారంభించదు. యుద్ధాలను ఆపుతుంది. ఇజ్రాయెల్ నుంచి ఉక్రెయిన్ వరకు మన మిత్రదేశాలకు మద్దతుగా నిలుస్తాం. అలాగే, ఇరాన్, రష్యాలో మన శత్రువులను సమర్థంగా ఎదుర్కొంటాం.
గతంలో సోవియట్ యూనియన్ లాగే భవిష్యత్తులో కమ్యూనిస్ట్ చైనా కూడా కాల గర్భంలో కలిసిపోతుంది” అని చెప్పారు. చైనా నియంతృత్వ నేతలు ప్రపంచాన్ని “కమ్యూనిస్టు దౌర్జన్యం” పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారని నిక్కీ హేలీ విమర్శించారు. చైనాను అమెరికా మాత్రమే నిలువరించగలదని అన్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ప్రకటించారు. రిపబ్లికన్ నుంచి ఆయనకు పోటీగా నిలిచారు నిక్కీ హేలీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ది బలహీన నాయకత్వం అని ఆమె విమర్శించారు.
MBA Chaiwala: మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న చాయ్‌వాలా.. ఎలా సాధ్యమైందంటే!