శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 21 మంది మృతి.. మరో 14 మందికి తీవ్రగాయాలు.. ఎలా జరిగిందంటే?

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.

శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 21 మంది మృతి.. మరో 14 మందికి తీవ్రగాయాలు.. ఎలా జరిగిందంటే?

Updated On : May 11, 2025 / 4:31 PM IST

శ్రీలంక భారీ బస్సు ప్రమాదం జరిగి 21 మంది మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. తేయాకు పండించే ఓ కొండ ప్రాంతంలో ఇవాళ ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు కొండపై నుంచి జారిపడిందని అధికారులు తెలిపారు.

శ్రీలంక రాజధాని కొలంబోకు తూర్పున 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్మలే పట్టణానికి సమీపంలో ఒక పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి రవాణ, రహదారుల ఉప మంత్రి ప్రసన్న గుణసేన మీడియాకు వివరాలు తెలిపారు.

Also Read: రూ.25,000లోపే 6 ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్లు.. వీటిలో ఏది కొంటారో మీ ఇష్టం..

ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారని, గాయాలపాలైన మరో 14 మందికి ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నామని ప్రసన్న గుణసేన అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ బస్సు ప్రమాదంలో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ బస్సు ప్రభుత్వ సంస్థకు చెందినదని పోలీసులు చెప్పారు. శ్రీలంకలోని పర్వత ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయి. అలాగే, అక్కడి రోడ్ల నిర్వహణ కూడా సరిగ్గా ఉండదు.