రూ.25,000లోపే 6 ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్లు.. వీటిలో ఏది కొంటారో మీ ఇష్టం..

వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో, వీటిని ఎందుకు కొనాలో చూద్దాం..

రూ.25,000లోపే 6 ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్లు.. వీటిలో ఏది కొంటారో మీ ఇష్టం..

Updated On : May 11, 2025 / 3:48 PM IST

మీకు గేమింగ్‌పై బాగా ఆసక్తి ఉందా? అందుకు తగ్గ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని భావిస్తున్నారా? అయితే, రూ.25,000లోపే ఆరు మంచి స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో, వీటిని ఎందుకు కొనాలో చూద్దాం..

పోకో F6
పోకో F6 ధర రూ.24,990. 8GB RAMతో Snapdragon 8s Gen 3 చిప్‌తో వచ్చింది. గేమింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. డ్యూయల్ రియర్ కెమెరాలు (50MP + 8MP), 20MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. టర్బో ఛార్జింగ్, USB టైప్-C ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.

Also Read: పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం.. ఒక్కసారిగా చెప్పేసిన పాకిస్థాన్ అధికారి

ఐక్యూ Z10
ఐక్యూ Z10 ధర రూ.21,999. స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 SoCతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAMతో పాటు 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. బ్యాక్‌సైడ్ 50MP + 2MP, ఫ్రంట్‌ సైడ్ 32MP కెమెరా హార్డ్‌వేర్‌ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7300mAh బ్యాటరీ ఉంది.

పోకో X7 Pro
పోకో X7 Pro ధర రూ.24,496. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్, 8GB RAMతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.67-అంగుళాల FHD+ AMOLED సిల్కీ-స్మూత్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. బ్యాక్‌సైడ్ 50MP + 8MP డ్యూయల్-కెమెరా సెటప్, 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6550mAh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3a
నథింగ్ ఫోన్ 3a ధర రూ.24,999. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్, 8GB RAMతో అందుబాటులో ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్‌తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరాలు (50MP + 8MP + 50MP), 32MP ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. ఇందులో 5000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వన్‌ప్లస్‌ Nord 4
వన్‌ప్లస్‌ Nord 4 ధర రూ.23,891. ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 7 Plus Gen 3తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, 8GB RAM, 5500mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది. 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

మోటొరోలా ఎడ్జ్ 60 స్టైలస్
మోటొరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ధర రూ.22,999. మంచి డిస్ప్లే, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు ఉంది. డ్యూయల్ 50MP + 8MP కెమెరాలు, AI ఫీచర్లతో అందుబాటులో ఉంది. మంచి డిజైన్ ఉంది.