Jumping Castle Tragedy : బౌన్సీ క్యాసల్‌ను ఎగురేసుకెళ్లిన రాకాసి గాలులు.. నలుగురు చిన్నారులు మృతి

ఆస్ట్రేలియాలో రాకాసి గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

Jumping Castle Tragedy : బౌన్సీ క్యాసల్‌ను ఎగురేసుకెళ్లిన రాకాసి గాలులు.. నలుగురు చిన్నారులు మృతి

Bouncy Castle, Strong Winds Air, Australia's Prime Minister, Scott Morrison, Australia Jumping Castle Tragedy

Updated On : December 16, 2021 / 9:53 PM IST

Jumping Castle Tragedy : ఆస్ట్రేలియాలో రాకాసి గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్కూలు ఫేర్‌వెల్ సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. బలమైన గాలలు వీయడంతో పిల్లలు ఆడుకుంటున్న బౌన్సి క్యాస్టిల్ అమాంతం 10 మీటర్ల (33 అడుగులు) ఎత్తువరకు గాల్లోకి ఎగిరింది. దానిపై ఆడుకుంటున్న పిల్లలు కిందపడి మృతిచెందినట్టు ఆస్ట్రేలియా స్థానిక మీడియా నివేదించింది.

మృతుల్లో.. హిల్‌క్రెస్ట్ ప్రైమరీ స్కూల్‌లో చివరి సంవత్సరం చదువుతున్న ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నట్టు గుర్తించారు. ఉదయం 10 గంటలకు తాస్మానియా రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలోని డెవాన్‌పోర్ట్‌లో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు చిన్నారులు మృతిచెందాగా.. మరో ఐదుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

విద్యార్థుల గుర్తింపు వివరాలను కూడా అధికారులు రివీల్ చేయలేదు. మరణించిన విద్యార్థుల వయస్సు 10 లేదా 11 ఏళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. విషాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు టాస్మానియన్ ప్రీమియర్ పీటర్ గుట్వీన్ వెల్లడించారు. ప్రమాద ఘటనపై స్పందించిన దేశీయ ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ తీవ్ర విషాద ఘటనగా అభివర్ణించారు.


Read Also :  Pushpa Movie : తెలంగాణలో ‘పుష్ప’ ఐదు షోలకు అనుమతి