Pushpa Movie : తెలంగాణలో ‘పుష్ప’ ఐదు షోలకు అనుమతి
పుష్ప మూవీ ఐదు షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. రూ.50 టికెట్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లేకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది.

Pushpa Movie
Pushpa Movie : ఐకానిక్ స్టార్ అల‍్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్ వస్తున్న ‘పుష్ప ది రైజ్’ ప్రభంజనం మొదలు కావడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. డిసెంబర్ 17న ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ‘పుష్ప’ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “పుష్ప” చిత్రం కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 17 తేదీ నుంచి 30 తేదీ వరకు అదనపు షో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఇక రూ.50 టికెట్ల పెంపుపై కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
చదవండి : Pushpa 1 : పుష్ప రివ్యూ, అదిరిపోయిందంటున్న ఉమైర్ సంధు
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రోజు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలి. ప్రభుత్వం ప్రత్యేక షోలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. నాలుగు షోలే ఉండటంతో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 35ను హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది. థియేటర్ల యాజమాన్యం తరపున న్యాయవాది దుర్గాప్రసాద్ వాదిస్తూ టిక్కెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, అది ఓనర్ల హక్కు అని అన్నారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు జిఒను సస్పెండ్ చేసింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది. అయితే హైకోర్టు ఈ విషయంపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
చదవండి : Pushpa: పుష్ప టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెస్