YS Jagan: ఆ ఒక్క అంశంలో ఫ్యాన్ పార్టీ సక్సెస్ అయినట్లేనా?

ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని..ఏ అంశంలో కూడా వైసీపీ అప్పర్ హ్యాండ్‌ సాధించలేదన్న టాక్ ఉంది.

YS Jagan: ఆ ఒక్క అంశంలో ఫ్యాన్ పార్టీ సక్సెస్ అయినట్లేనా?

YS Jagan

Updated On : December 18, 2025 / 9:30 PM IST

YS Jagan: అధికారం పోయి 18 నెలలు. ఈ ఏడాదిన్నరలో వైసీపీ అపోజిషన్‌ రోల్‌కు ఎన్ని మార్కులని అడిగితే అందరికీ క్వశ్చన్ మార్కే. మాజీ సీఎం జగన్‌ ఇష్యూ బేస్డ్‌గా జిల్లాల పర్యటన చేసినా..పరామర్శల పేరుతో హడావుడి చేసినా..ఆయన చేపట్టిన ప్రతీ కార్యక్రమం ఏదో ఒక విధంగా రచ్చకు దారి తీసింది. రెంటపాళ్ల పర్యటనలో రప్పా రప్పా రచ్చ..మామిడి, మిర్చి రైతుల పరామర్శలో తోపులాటలు, కేసులు అంటూ ఇష్యూ డైవర్ట్ అయింది. ఒక మెడికల్ కాలేజీ అంశంలో మాత్రం వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది.

వైసీపీ హయాంలో కట్టిన..ఇంకా నిర్మాణంలో ఉన్న కాలేజీలను పీపీపీ విధానంలో నడిపించాలని కూటమి ప్రభుత్వం భావించగా.. వైసీపీ తీవ్రంగా అపోజ్ చేస్తోంది. పేదలకు ఉన్నత వైద్య, విద్య అందాలనే లక్ష్యంతో..ఎన్నో ప్రయాసలకు ఓర్చి మెడికల్ కాలేజీలు కడితే ప్రైవేటును భాగస్వామ్యం చేయడమేంటంటూ గళమెత్తారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల పర్యటనలు చేశారు వైసీపీ లీడర్లు. చివరకు మాజీ సీఎం జగన్ కూడా నర్సీపట్నం మెడికల్ కాలేజీని విజిట్ చేసి..పీపీపీ విధానంపై మొండిగా ముందుకెళ్తే..తాము వచ్చాక రద్దు చేస్తామని బిగ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చి చర్చకు దారి తీశారు. దీంతో కూటమి ప్రభుత్వ పెద్దలు రియాక్ట్‌ అయ్యేలా వైసీపీ ఒత్తిడి పనిచేసిందన్న ఒపీనియన్స్ ఉన్నాయి. (YS Jagan)

ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యా పరంగా అంతంత మాత్రంగానే బలం ఉన్న కాంగ్రెస్..మెడికల్ కాలేజీల ఇష్యూలో బలంగా ప్రజల్లోకి వాయిస్ తీసుకెళ్లగలిగింది. టీడీపీ నేతలు చెప్తున్నదేంటి..తాము కట్టిన మెడికల్ కాలేజీలు ఎన్ని..ఇంకా నిర్మాణంలో ఉన్న కాలేజీలు ఎన్ని అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జనాల్లో చర్చ పెట్టగలిగారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తే వచ్చే సమస్యలేంటి.? ప్రజలకు జరిగే నష్టమెంత.? అనేదానిపై తమ వాయిస్‌ను వినిపించడంలో వైసీపీ అంతో ఇంతో సక్సెస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: గులాబీ దళపతి కదనరంగంలోకి దిగబోతున్నారా? వ్యూహ రచన సిద్ధం?

మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతరేకిస్తూ..చివరకు కోటి సంతకాలు సేకరణ పేరుతో ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్‌ జగన్‌. ఈ ఏడాది అక్టోబర్‌లో గ్రామాల్లో రచ్చబండ పేరుతో మొదలైన సంతకాల సేకరణ కార్యక్రమం కాస్త లేటైనా..కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు..అన్ని వర్గాల ప్రజలతో కోటి సంతకాల సేకరణ చేపట్టి..రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. పార్టీ ముఖ్యనేతలతో కలిసి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ అయిన జగన్‌..మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ప్రజల అభిప్రాయాలను వివరించారు.

నేతల వరుస అరెస్టులు, ఒక కేసు తర్వాత మరో కేసు
ఈ ఏడాదిన్నర కాలంలో వైసీపీ పూర్తిగా డిఫెన్స్‌లో ఉందనే చర్చ ఉంది. ఘోరంగా ఓడిపోయి.. అధికారం కోల్పోయిన బాధ ఓ వైపు ఉండగానే.. నేతల వరుస అరెస్టులు, ఒక కేసు తర్వాత మరో కేసు ముఖ్యనేతలను వెంటాడటం..ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని..ఏ అంశంలో కూడా వైసీపీ అప్పర్ హ్యాండ్‌ సాధించలేదన్న టాక్ ఉంది.

ఒక్క మెడికల్ కాలేజీల అంశంలో మాత్రం ఫ్యాన్ పార్టీ పూర్తిస్థాయిలో అపోజిషన్‌ పాత్ర పోషించిందని..నిరసనలు తెలపడమే కాదు..ప్రజల్లోకి చర్చ పెట్టగలిగారని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సేమ్‌టైమ్‌ తాము అధికారంలోకి వస్తే పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పడం ద్వారా..జగన్‌ తన స్టాండ్‌ ఏంటో క్లియర్‌ కట్‌ చెప్పినట్లు అయిందని చెబుతున్నారు. దీంతో ఎడ్యుకేటెడ్‌ సెక్టార్‌కు ఓ సంకేతం పంపించారని..వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏదైనా ఏడాదిన్నర కాలం ప్రతిపక్ష హోదాలో వైసీపీ సాధించిన అతిపెద్ద విజయంగా మెడికల్ కాలేజీ అంశాన్ని చెప్పుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు.