మున్సిపల్ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ పోల్స్..! సర్కార్ రూట్ మార్చిందా? ప్లాన్ బీ రెడీ చేసిందా?
పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న విధంగా మంచి రిజల్ట్ వస్తే.. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అనుకున్నారట.
Revanth Reddy
Local Body Elections: ప్రభుత్వంలో ఉన్నాం..పైగా జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో గెలిచాం. ఇదే మంచి మూమెంట్ అంటూ ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకుని..పంచాయతీ పోల్స్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. మూడు విడతల్లో 12వేల 726 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకం పెట్టుకుంది. కచ్చితంగా పంచాయతీల్లో వార్వన్సైడే అని డిసైడ్అయిపోయింది. 90 శాతానికి పైగా పంచాయతీల్లో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లింది.
సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలంతా పంచాయతీ సమరంలోనే మునిగిపోయారు. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ సానుభూతి పరులు గెలిస్తే కలిగే లాభాలను నేతలకు వివరించారు. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటితే..ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు వచ్చే జనరల్ ఎలక్షన్కు ఫైట్ చేయడం ఈజీ అవుతుందనే ఆలోచన చేశారు. అందుకే సీఎం రేవంత్ ఈ ఎలక్షన్ను సీరియస్గా తీసుకున్నారు. జిల్లాల్లోనూ సభలు నిర్వహించడం ద్వారా సర్పంచ్ ఎన్నికల హీట్ పెంచారు.
Also Read: Nara Lokesh: టీమ్ లోకేశ్.. ఇటు మిస్సైల్స్.. అటు జీపీఎస్‌లు..!
రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి..పంచాయతీల్లో గెలవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ స్వయంగా సీయం రేవంతే ఉమ్మడి జిల్లాల్లో సభలు నిర్వహించారు. దీంతో నేతలు చాలా సీరియస్ గా తీసుకొని మొదట్లో ఏకగ్రీవం చేసేందుకు ప్లాన్ చేశారు. మొదటి విడత ఎన్నికల్లో 67 శాతం ఫలితాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు, మూడు విడుతల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ..మరింతగా పుంజుకోవడంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది.
అందుకే ప్లాన్ బీ అమలు!
మొదటి విడతలో 67 శాతం గెలుపొందిన కాంగ్రెస్.. మూడు విడుతలు ముగిసే సరికి 52 శాతానికి పడిపోయింది. అనుకున్న దానికన్నా కాంగ్రెస్ వెనుకబడితే.. బీఆర్ఎస్ ఊహించినదానికన్నా పుంజుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చిన గ్రామీణ ప్రాంతంలో..బీఆర్ఎస్ మెల్లమెల్లగా పుంజుకుంటున్నట్లు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా వేసి.. ప్లాన్ బీ అమలు చేసే ఆలోచనలో పడ్డారట కాంగ్రెస్ పెద్దలు.
పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న విధంగా మంచి రిజల్ట్ వస్తే.. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అనుకున్నారట. కానీ 90 శాతం టార్గెట్ పెట్టుకుంటే 50 శాతానికే పరిమితం కావడంతో కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో పడ్డారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం కన్నా.. మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారట.
ముఖ్యంగా వృద్ధులకు అందజేసే పెన్షన్ పెంపు, రైతు భరోసా నిధులను మరోసారి విడుదల చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట. ఈలోగా అర్బన్ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలను పూర్తిచేయాలని ఆలోచనలో ఉందట. గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి, ఏప్రిల్లో నిర్వహించాలని అనుకుంటుందట కాంగ్రెస్ సర్కార్.
పంచాయతీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటమని చెప్తూ మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడుతారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి..అన్ని పార్టీల ఒపీనియన్ తీసుకుని..ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై డెసిషన్ తీసుకుంటామని సీఎం చెప్పడం కొసమెరుపు.
