Nidhi Agarwal: అభిమానమా? అరాచకమా? కనపడితే చాలు మీద పడిపోవడమేనా.. సెలబ్రెటీలకు సేఫ్టీ ఎలా..

ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే అందులోని లోటుపాట్లు, తలెత్తే ఇబ్బందుల గురించి ఖచ్చితంగా ఊహించాలి, అంచనా వేయాలి.. దానికి తగినట్లుగా ప్లాన్ చేయాలి..

Nidhi Agarwal: అభిమానమా? అరాచకమా? కనపడితే చాలు మీద పడిపోవడమేనా.. సెలబ్రెటీలకు సేఫ్టీ ఎలా..

Updated On : December 18, 2025 / 9:12 PM IST

Nidhi Agarwal: రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, శరీరాన్ని అభ్యంతరకరరీతిలో తాకడంతో.. తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలపై ఇలా పడటం కరెక్ట్ కాదని మండిపడ్డారు.

ఈవెంట్.. సినిమా ప్రమోషన్ కావచ్చు.. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కావొచ్చు.. జ్యూయెలరీ షాపులు..ఇంకా ఇతరత్రా ఫంక్షన్లు..కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సినిమా నటులకు భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తుతూనే ఉంటాయ్. ఈ దిశగా బౌన్సర్లను తమ రక్షణ కోసం తెచ్చుకుంటున్నా..ఫ్యాన్స్ మితిమీరిన వైఖరితో..తిప్పలు తప్పడం లేదు. అసలు నిజంగా ఇలాంటోళ్లని అభిమానులని అనడం కూడా కరెక్ట్ కాదు..ఛాన్స్ దొరికింది కదా అని.. సెలబ్రెటీలు తమ దగ్గర్లో కన్పించగానే మీదపడి సెల్ఫీలు దిగడం..అవతలి వారి ఇబ్బందులను గమనించకుండా ప్రవర్తించడం సరైంది కాదు.

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని లులు మాల్‌లో ఈవెంట్ జరగగా.. హీరోయిన్లు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్ లతో పాటుగా దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, SKN హాజరయ్యారు. దీనికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టారు. హీరోయిన్లు కూర్చున్న సోఫాల మీదకు దూసుకొచ్చారు. ఒకానొక టైంలో SKN వాళ్లను వారించినా వినిపించుకోలేదు.

ఇక్కడ నిర్వాహకులపైనే తప్పుని పూర్తిగా నెట్టివేయడం కూడా కరెక్ట్ కాదనాలి. ఎందుకంటే.. తమ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్‌ని పిలుస్తారే తప్ప ఇలా అతి చేస్తూ.. మీద పడిపోతారని ఊహించరు.. కానీ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే అందులోని లోటుపాట్లు, తలెత్తే ఇబ్బందుల గురించి
ఖచ్చితంగా ఊహించాలి, అంచనా వేయాలి.. దానికి తగినట్లుగా ప్లాన్ చేయాలి..లేకపోతే ఏం జరుగుతుంది అనేదానికి పెద్ద ఉదాహరణ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటే.. అలాంటి ఇన్సిడెంట్లు జరగాలని ఎవరూ కోరుకోరు.. కానీ జరగకుండా ఉండాలంటే..ఈ అతిగాళ్లని కంట్రోల్ చేసే మెకానిజం కూడా ఏర్పాటు చేసుకోవాలి.

Also Read: విడిపోయిన 31 ఏళ్ళ తర్వాత మాజీ భార్య మీద కేసు వేసిన స్టార్ సింగర్.. 30 లక్షలు ఇవ్వాలంటూ..