Ambulance Helicopter: ఆసుపత్రి భవనాన్ని ఢీ కొన్న అంబులెన్స్ హెలికాప్టర్.. నలుగురి మృతి
ఆ సమయంలో ఆ అంబులెన్స్ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్, మరో వైద్య సిబ్బంది ఉన్నారు.

అంబులెన్స్ హెలికాప్టర్ ఓ ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టి నేలమీద కూలిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నైరుతి టర్కీలో ఆదివారం చోటుచేసుకుంది. మొగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
ఆ సమయంలో ఆ అంబులెన్స్ హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్, మరో వైద్య సిబ్బంది ఉన్నారని టర్కీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై ముగ్లా గవర్నర్ ఇద్రిస్ అక్బియిక్ మీడియాతో మాట్లాడుతూ.. హెలికాప్టర్ మొదట ఆసుపత్రి భవనంలోని నాలుగో అంతస్తును ఢీకొని నేలమీద కూలిపోయిందని వివరించారు.
భవనం లోపలగానీ, నేలపైగానీ ఎవరూ గాయపడలేదని అన్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదానికి గల ఇతర కారణాలపై ఆరా తీస్తున్నారని అన్నారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో అనేక అంబులెన్సులు, అత్యవసర బృందాలు కనపడ్డాయి.
Purandeswari : అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్‌కు పురందేశ్వరి కౌంటర్