African Woman : ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన 40 ఏళ్ల మహిళ

12 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం కావడంతో అప్పటినుంచి ఆమె బిడ్డలకు జన్మనివ్వడం ప్రారంభం అయింది. 12 ఏళ్లకే నబతాంజిని ఆమె తల్లిదండ్రులు అమ్మడంతో మరుసటి ఏడాదే ఆమె తల్లి అయింది.

African Woman : ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన 40 ఏళ్ల మహిళ

African woman

Updated On : April 12, 2023 / 3:41 PM IST

African Woman : కొంతమంది మహిళలకు పెళ్లై ఏళ్లు గడిచినా సంతానం లేక బాధపడుతుంటారు. సంతానం కోసం గుళ్లు, గోపురాలు, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. మరికొంతమంది మహిళలకు ఎక్కడా తిరుగకున్నా సంతానం కలుగుతుంది.  ఒకవేళ వారు వద్దనుకున్నా పిల్లలు పుడతారు. అయితే సాధారణంగా మహిళలకు 5, 10 మంది మహా అయితే 15 మంది పిల్లల సంతానం కలుగుతుంది, కానీ ఓ మహిళకు ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది.

ఆఫ్రికాకు చెందిన ఓ మహిళ 40 ఏళ్లలో ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక సంతానం కలిగిన మహిళగా ఆమెను పరగణిస్తున్నారు. మరియం నబతాంజికి 13 ఏళ్ల వయసులో కవల పిల్లలు పుట్టారు. మామ ఉగాండగా పేరు పొందిన మహిళా సంతానం ఉగాండా, తూర్పు ఆఫ్రికాలో ఉన్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహం కావడంతో అప్పటినుంచి ఆమె బిడ్డలకు జన్మనివ్వడం ప్రారంభం అయింది. 12 ఏళ్లకే నబతాంజిని ఆమె తల్లిదండ్రులు అమ్మడంతో మరుసటి ఏడాదే ఆమె తల్లి అయింది.

India : ఎక్కువమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమానం

అయితే, నబతాంజి అండాశయాలు పెద్దగా ఉన్నాయని, గర్భనిరోధక మాత్రలు ఎన్నడూ వాడరాదని వాటితో ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు ఆమెకు సూచించారు. అధిక సంతానం కలగడం ఆమె కుటుంబ చరిత్రలో వారసత్వంగా లభించింది. ప్రస్తుతం నబతాంజికి ఐదు జతల కవలలు, ముగ్గురు చొప్పున ఐదు జతలు, నలుగురు చొప్పున ఐదు జతల సంతానం ఉండగా, ఒకే ఒక్కసారి ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో మొత్తం 44 మందికి ఆమె జన్మనిచ్చింది. కాగా, ఆమె ఆరుగురు పిల్లలను కోల్పోవడంతో ప్రస్తుతం 20 మంది బాలురు, 18 మంది బాలికలతో 38 మంది పిల్లలు మిగిలారు. అయితే నబతాంజి దగ్గర డబ్బులు తీసుకుని భర్త కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆమె సింగిల్ మధర్ గా 38  మంది పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు.