Israel-Iran Conflict : ఇజ్రాయెల్‌పై 400 క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్.. బాంబ్ షెల్టర్లలో తలదాచుకున్న ఇజ్రాయెల్‌లు!
Israel-Iran Conflict : ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా 400కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో ప్రత్యక్ష దాడులకు దిగింది.

400 missiles, rockets fired from Iran, all Israelis in bomb shelters
Israel-Iran Conflict : పశ్చిమాసియాలో భీకర యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ భూభాగంపై ఏకంగా 400కు పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో ప్రత్యక్ష దాడులకు దిగింది.
దాంతో దేశవ్యాప్తంగా సైరన్ల మోత మోగుతోంది. దేశ ప్రజలను అప్రమత్తం చేయడంతో మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లు ప్రస్తుతం బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ కూడా ఈ ఇరాన్ దాడులను ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇటీవలి పరిస్థితుల అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా నివాసితులు ఇప్పుడు రక్షిత స్థలాలను విడిచిపెట్టడానికి అనుమతించినట్టు ప్రకటించింది. అయితే, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ నుంచి కొనసాగుతున్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. ఆకాశంలో నుంచి రాకెట్లు దూసుకువస్తున్న సమయంలో రాబోయే ముప్పును అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను యాక్టివ్ చేసింది.
“కొద్దిసేపటి క్రితం.. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ రాష్ట్రం వైపు క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లు అప్రమత్తంగా ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్ సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. గత కొద్ది నిమిషాల్లో, హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలను రక్షించే సూచనలను చేసింది. ఇజ్రాయెల్ రాష్ట్రంలోని పౌరులను రక్షించడానికి ఐడీఎఫ్ అవసరమైన ప్రతిదాన్ని చేస్తుంది” అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
అంతకుముందు, ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తతలు పెరగడంతో మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లు ప్రస్తుతం బాంబు షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. “ఇజ్రాయెల్ అంతటా ఉన్న మా సోదరులు, సోదరీమణులకు, మీలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం” అని ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది.
🇮🇷🇮🇱#BREAKING: The Iron Dome Is Failing to Stop Iran’s Missiles pic.twitter.com/kTIiNSTNHP
— Censored Men (@CensoredMen) October 1, 2024
ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం : జో బైడెన్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.. ఇజ్రాయెల్‌కు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత మోగుతోంది. టెల్ అవీవ్, జెరూసలేం సమీపంలో భారీగా పేలుళ్లు జరిగినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్ క్షిపణలు దాడులు చేస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడగా.. పలువురు మృతి చెందినట్లు సమాచారం.
ఇస్మాయిల్ హనియెహ్, హసన్ నస్రల్లా నిల్ఫోరూషన్ మరణానికి ప్రతీకారం : ఇరాన్
ఇజ్రాయెల్‌పై దాడిని ప్రారంభించిన తర్వాత ఇరాన్ అధికారిక ప్రకటనలో ఇలా పేర్కొంది.. “ఇస్మాయిల్ హనియెహ్, సయ్యద్ హసన్ నస్రల్లా, అమరవీరుడు నిల్‌ఫోరూషన్‌ల బలిదానానికి ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆక్రమిత భూభాగాలను లక్ష్యంగా చేసుకున్నాం” అని టెహ్రాన్ టైమ్స్ నివేదించింది.
ఇరాన్ క్షిపణులను కూల్చివేయండి : యూఎస్ మిలిటరీకి జో బిడెన్ ఆదేశాలు :
ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను కూల్చివేయాలని, “ఇజ్రాయెల్ రక్షణకు సహాయం” చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా మిలిటరీని ఆదేశించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ ప్రాంతంలో తన సైనిక ఉనికిని గణనీయంగా పెంచుకున్న యూఎస్ ఏప్రిల్ 13న ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ మునుపటి దాడి సమయంలో ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించింది.
Read Also : Sadhguru Isha Foundation : సద్గురుకు బిగ్ షాక్.. ఇషా ఫౌండేషన్‌లో 150 మంది పోలీసుల తనిఖీలు!