Pak MP Mariiage : 18 ఏళ్ల యువతిని మూడో పెళ్లి చేసుకున్న 49 ఏళ్ల పాకిస్థాన్ ఎంపీ

పాకిస్థాన్ ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. 49 ఏళ్ల అమీర్ లియాఖత్ 18 ఏళ్ల యువతిని మూడో వివాహం చేసుకోవటం సోషల్ మీడియాలో మీమ్స్ తో నెటిజన్లు..

Pak MP Mariiage : 18 ఏళ్ల యువతిని మూడో పెళ్లి చేసుకున్న 49 ఏళ్ల పాకిస్థాన్ ఎంపీ

Pak Mp Aamir Liaquat's Third Mariiage

Updated On : February 12, 2022 / 2:11 PM IST

Pak MP Aamir Liaquat’s third Mariiage : పాకిస్థాన్ అధికార పార్టీ “పీటీఐ” ఎంపీ అమీర్ లియాఖత్ హుస్సేన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. బుధవారం (ఫిబ్రవరి10,2022)న 49 ఏళ్ల అమీర్ లి యాఖత్ 18 ఏళ్ల యువతిని మూడో వివాహం చేసుకున్నారు.ఈయనగారి మూవో వివాహంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. తన వివాహం గురించి అమీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

‘గత రాత్రి 18 ఏళ్ల సయేదా దానియా షాను పెండ్లి చేసుకున్నా. ఆమె దక్షిణ పంజాబ్‌ లోధ్రాన్‌లోని గౌరవనీయమైన నజీబ్ ఉత్ టార్ఫైన్ ‘సాదాత్’ కుటుంబానికి చెందిన యువతి. చాలా అందంగా, మనోహరంగా, సరళంగా, ప్రియంగా ఉంటుంది. మా జంటను ఆశీర్వదించండి. దయ చేసి మా కోసం ప్రార్థించండి. నేను ఇప్పుడే చీకటి గుహ నుంచి బయటపడ్డాను. నా గత జీవితం రాంగ్ టర్న్’ అని ఇన్ స్టాలో రాసుకొచ్చారు అమీర్.

కాగా..అమీర్ రెండో భార్య, పాక్‌ నటీ తుబా అమీర్‌ నుంచి విడాకులు పొందిన బుధవారం రోజునే, 18 ఏళ్ల అమ్మాయిని అమీర్ లియాఖత్ వివాహం చేసుకోవటం విశేషం. వివాహానికి ముందే అమీర్ తన కొత్త భార్య గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే పెళ్లి తరువాత తన మూడో భార్యతో కలిసి ఒక టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

అమీర్ లియాఖత్ మూడో పెళ్లి పాక్‌ నెటిజన్లు సోషల్‌ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. వారిద్దరి మధ్య 31 ఏళ్ల వయసు తేడా ఉండటంతో మీమ్స్‌ తో రచ్చ రేపుతున్నారు. అమీర్‌ లియాఖత్‌ 18 ఏళ్ల క్రితమే తన భార్యను ఎత్తుకున్నారంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.