క్వారంటైన్ లో ఉండకపోతే రూ.5 కోట్ల జరిమానా

కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల  జైలు శిక్ష విధించనున్నారు. 

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 03:07 PM IST
క్వారంటైన్ లో ఉండకపోతే రూ.5 కోట్ల జరిమానా

Updated On : April 21, 2020 / 3:07 PM IST

కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల  జైలు శిక్ష విధించనున్నారు. 

కరోనా నియంత్రణకు లాక్ డౌన్ విధించినప్పటికీ ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండలేకపోతున్నారు. విదేశాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అందుకే కెనడా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన వాళ్లు బయట కనిపిస్తే భారత కరెన్సీలో రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల 56 లక్షల వరకు జరిమానాతో పాటు మూడేళ్ల  జైలు శిక్ష విధించనున్నారు. 

కరోనా నియంత్రణలో భాగంగా కెనడా ప్రభుత్వం మార్చి 25 నుంచి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. విదేశాల నుంచి వచ్చినవారెవరైనా 14 రోజులు బయట కనిపిస్తే జరిమానా, జైలు శిక్ష ఖాయం. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లల్లో ఉంటున్నారా లేదా అని చూసేందుకు కెనడా పబ్లిక్ ఏజెన్సీ, పోలీస్ శాఖకు ఆ వివరాలు అందజేస్తోంది. 

పోలీసులు ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆ ఇల్లు చెక్ చేసి వాళ్లు లోపల ఉన్నారా లేదా పరిశీలిస్తారు. ఒకవేళ ఇంట్లో లేకపోతే వారు ఎక్కడా ఉన్నా పట్టుకుని నేరుగా జైలుకు  తీసుకెళ్తారు. ఈ చట్టం గురించి విమానాశ్రయంలోనే ముందుగా వివరించి కాగితం మీద అంగీకార పత్రం తీసుకుని గానీ వదిలిపెట్టరు.