United States : 63 ఏళ్ల తర్వాత హైస్కూల్ క్రష్‌కు ప్రపోజ్ చేసిన 78 ఏళ్ల వ్యక్తి

వాళ్లిద్దరూ హైస్కూల్‌లో కలిసి చదువుకున్నారు. దాదాపుగా 60 ఏళ్ల తరువాత రీయూనియన్‌లో కలిశారు. అతను 78 ఏళ్ల వయసులో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇదేం ప్రేమ కథ అనుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చదవండి.

United States : 63 ఏళ్ల తర్వాత హైస్కూల్ క్రష్‌కు ప్రపోజ్ చేసిన 78 ఏళ్ల వ్యక్తి

United States

Updated On : July 7, 2023 / 12:22 PM IST

United States : ఎంత పెద్ద చదువులు చదివినా.. ఎక్కడ స్థిరపడినా  స్కూలుని, స్కూల్ ఫ్రెండ్స్‌ని అస్సలు మర్చిపోలేరు. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసిన వారిపై ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు వినబోయే స్టోరీ మాత్రం చాలా వింతగా ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత హైస్కూల్ రీ‌యూనియన్‌లో కలిసిన ఇద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. 78వ ఏట ఒక్కటవుతున్న ఆ జంట ప్రేమ కథ చదవండి.

World Chocolate Day 23 : ప్రేమను పెంచుకోవాలంటే చాక్లెట్లు పంచుకోవాలి.. విశేషాలు ఇవే..

డాక్టర్ థామన్ మెక్‌మీకిన్ టంపా బే ప్రాంతంలోనూ, నాన్సీ గాంబెల్ యూఎస్ కాలిఫోర్నియాలోను నివసిస్తున్నారు. ఇద్దరూ హైస్కూల్‌లో కలిసి చదువుకున్నారు. అప్పట్లో మెక్‌మీకిన్ ఆమెపై ప్రేమ పెంచుకున్నాడట. అయితే ఇద్దరు వేర్వేరు చోట్ల కాలేజీల్లో చదువులు ఆ తరువాత వేర్వేరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. దాదాపుగా 63 ఏళ్ల తర్వాత 78 ఏళ్ల వయసులో హైస్కూల్ రీయూనియన్ సందర్భంగా కలిశారు. ప్రస్తుతం ఇద్దరూ ఒంటరిగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో చాలా దగ్గరయ్యారు.

Love Marriage : ప్రేమ పెళ్లి తెచ్చిన తంటా

మెక్‌మీకిన్ గాంబెల్‌ను టంపా బేకు ఆహ్వానించారు. గాంబెల్ విమానం నుంచి బయటకు వచ్చి మెక్‌మీకిన్‌ను ఎయిర్ పోర్టులో కలిసినపుడు ఆమె షాకింగ్ ప్రపోజల్ పెట్టింది. ఆమెకు వెల్కం చెప్పిన మెక్‌మీకిన్ మోకాళ్లపై నిలబడి గాంబెల్‌కు ప్రపోజ్ చేశాడు. చూసేవాళ్లకు ఈ దృశ్యం భలేగా అనిపించింది. అలా ఈ జంట ఒక్కటయ్యారన్నమాట. రాసి పెట్టి ఉంటే ఎప్పటికైనా ఒక్కటౌతారంటే ఇదేనేమో. వీరిద్దరి లవ్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by ????????? ???? (@majicallynews)