Widding Cake Auction: వేలానికి సిద్ధమైన 41ఏళ్ల నాటి కేకు ముక్క.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

యువరాణి డయానా, కింగ్ చార్లెస్ రాజు వివాహం సమయంలో అధికారికంగా 23 కేకులు తయారు చేయించారు. ఐదు పొరలను కలిగి ఉన్న, ఐదు అడుగుల పొడవు ఉన్న ప్రూట్ కేక్ నుంచి ఈ ముక్కను నిగెల్ రికెట్స్ తీసి భద్రపర్చినట్లు తెలిసింది.

Widding Cake Auction: వేలానికి సిద్ధమైన 41ఏళ్ల నాటి కేకు ముక్క.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

Wedding Cake Auction

Updated On : October 20, 2022 / 8:02 AM IST

Widding Cake Auction: బ్రిటన్ నూతన రాజు కింగ్ ఛార్లెస్-3, యువరాణి డయానా దంపతుల వివాహం 1981లో జరిగింది. ఈ వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. అప్పట్లో 3వేల మందికిపైగా అతిథులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుక సందర్భంగా పలువురు కేక్‌లు తెచ్చి దంపతులచేత కట్ చేయించారు. ఈ క్రమంలో గతఏడాది మరణించిన నిగెల్ రికెట్స్ అనే వ్యక్తి ఈ వివాహ వేడుకలో అతిథిగా పాల్గొన్నారు. అతను కేక్ ముక్కను భద్రపర్చాడు. 41ఏళ్లుగా దీనిని ఓ పెట్టెలో ఉంచగా అది చెక్కుచెదరలేదు. ప్రస్తుతం దీనిని ప్రముఖ సంస్థ డోర్ అండీ రీస్ వేలం వేయనున్నట్లు న్యూయార్క్ పోస్టు పేర్కొంది.

World Oldest Cake : 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు..ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే..!!

యువరాణి డయానా, కింగ్ చార్లెస్ రాజు వివాహం సమయంలో అధికారికంగా 23 కేకులు తయారు చేయించారు. ఐదు పొరలను కలిగి ఉన్న, ఐదు అడుగుల పొడవు ఉన్న ప్రూట్ కేక్ నుంచి ఈ ముక్కను నిగెల్ రికెట్స్ తీసి భద్రపర్చినట్లు తెలిసింది. అయితే 2014 సంవత్సరంలో డోర్ అండీ రీస్ అనే సంస్థ ఓ కేకు ముక్కను వేలం వేయగా నాడు 1,375 పండ్లు (దాదాపు రూ.1.27లక్షలు) పలికింది. ప్రస్తుతం నిగెల్ రికెట్స్ భద్రపర్చిన కేకు ముక్కను 300 పౌండ్లు (దాదాపు రూ. 27వేలు) నుంచి వేలం మొదలు పెట్టనున్నారు. అయితే, ఈ కేకు ముక్క వేలంలో భారీ ధరకు అమ్ముడు పోతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రిన్సెస్ డయానా, కింగ్ చార్లెస్-3 వివాహం 1981 జూలై 29న జరిగింది. లక్షలాది మంది ఈ వివాహాన్ని అప్పట్లో టీవీల్లో వీక్షించారు. దీనిని ‘శతాబ్దపు వివాహం’ అని కూడా పిలుస్తారు. అయితే, చార్లెస్, డయానా 1992లో విడిపోయారు. నాలుగు సంవత్సరాల ముందు వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు.