Pakistan Bus Fire: పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వరద బాధితులతో వెళ్తున్న బస్సుకు మంటలు.. 18మంది సజీవదహనం..

పాకిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. నూరియాబాద్‌లో వరద బాధితులతో వెళ్తున్న బస్సులో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారులు, మహిళలు దాదాపు 18మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి.

Pakistan Bus Fire: పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. వరద బాధితులతో వెళ్తున్న బస్సుకు మంటలు.. 18మంది సజీవదహనం..

Pakistan Bus Fire

Updated On : October 13, 2022 / 11:05 AM IST

Pakistan Bus Fire: పాకిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. నూరియాబాద్‌లో వరద బాధితులతో వెళ్తున్న బస్సులో బుధవారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారులు, మహిళలు దాదాపు 18మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. సింధ్‌లోని జంషోరో జిల్లా నూరియాబాద్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. వరద బాధితులను తీసుకువెళుతున్న వాహనం మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ప్రమాదంలో చిన్నారులుసైతం మరణించారు.

Heroin Seized From Pakistani Boat: గుజరాత్‌లో పాకిస్థానీ బోటు నుంచి రూ.360 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

నూరియాబాద్ డీఎస్పీ వాజిద్ తాహీం మాట్లాడుతూ.. బస్సు ప్రమాదంలో 18 మృతదేహాలను వెలికితీసినట్లు, అందులో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో లోపం కారణంగా బస్సులో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అయితే బస్సు ప్రమాద సమయంలో 35మంది వరకు ప్రయాణికులు ఉన్నారని, ప్రమాదం జరిగిన వెంటనే కొందరు బస్సునుంచి బయటకు దూకి ప్రాణాలుదక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మృతులంతా ముఘైరీ కమ్యూనిటీకి చెందినవారు. కరాచీ నుండి ఖైర్‌పూర్ నాథన్‌షాకు తిరిగి వస్తున్నారని తహీం చెప్పాడు. తీవ్రంగా కాలిన గాయాలైన వారిని లియాఖత్ యూనివర్శిటీ హాస్పిటల్ జంషోరోకు తరలించామని అధికారి తెలిపారు. కజకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తునకు చేపడతామని తెలిపారు.