Giant Cat : ఇది నిజంగా పిల్లేనా? ఎంత పెద్దగా ఉందో చూడండి..!

జపాన్ రాజధాని టోక్యోలో ఒక భారీ బిల్ బోర్డుపై ఓ పెద్ద పిల్లి కనిపించింది. కూర్చొన్నది కాస్తా పైకి లేచి meowing (మియావ్) అంటోంది. పిల్లి మధ్యలో అడ్వర్టైజ్ మెంట్స్ కనిపిస్తున్నాయి.

Giant Cat : ఇది నిజంగా పిల్లేనా? ఎంత పెద్దగా ఉందో చూడండి..!

Giant 3d Cat Has Taken Over Tokyo

Updated On : July 8, 2021 / 10:05 PM IST

Giant 3D cat has taken over Tokyo : జపాన్ రాజధాని టోక్యోలో ఒక భారీ బిల్ బోర్డుపై ఓ పెద్ద పిల్లి కనిపించింది. కూర్చొన్నది కాస్తా పైకి లేచి meowing (మియావ్) అంటోంది. పిల్లి మధ్యలో అడ్వర్టైజ్ మెంట్స్ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు పిల్లి మియావ్ అని అంటోంది. దానిపై టైమ్ కూడా డిస్ ప్లే అవుతుంది.. అరె.. చూడటానికి అచ్చం నిజమైన పిల్లాలా ఉందే అనుకున్నారంతా చూసినవాళ్లు.. వాస్తవానికి అది నిజమైన పిల్లి కాదు.. ఓ 3D పిల్లి.

ఇప్పటికే ఈ 3D క్యాట్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెద్ద పిల్లి 1,664 చదరుపు అడుగులు ఉంటుంది. కర్వడ్ LED స్క్రీన్ తో 4K రెజల్యూషన్ డిస్ ప్లేలో ఉంది. ఈ బిల్ బోర్డు టోక్యోలోని Shinjuku జిల్లాలో రద్దీగా ఉండే రైల్వ స్టేషన్లలో ఒకటి.

ఈ 3D క్యాట్ వీడియోను ఒక ట్విట్టర్ యూజర్ తన సోషల్ అకౌంట్లో పోస్టు చేయడంతో 4.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ట్విట్టర్ యూజర్ 17 సెకన్ల నిడివి గల వీడియోకు క్యాప్షన్ జపనీస్ లో పెట్టాడు. ఏదిఏమైనా ఈ 3D క్యాట్ మాత్రం రియల్ క్యాట్ మాదిరిగా నెటిజన్లను ఆకర్షిస్తోంది.