Golden Retriever : యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్న డాగ్
అది ఆషామాషీ డాగ్ కాదు.. యాడ్స్‌తో కోట్లు కొల్లగొడుతోంది. ఇక దానిని సంరక్షించడానికి యజమానులు ఉద్యోగాలు సైతం మానేశారు. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది ఆ డాగ్.

Golden Retriever
Dog that earns crores : ఓ డాగ్ సంవత్సరానికి అక్షరాల రూ.8 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తోంది. డాగ్ సెలబ్రిటీలలో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. సోషల్ మీడియాలో దాదాపుగా 25 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న ఆ డాగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉందా?
Mumbai : బోరివాలి టూ అంథేరి.. డెయిలీ ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న డాగ్
టక్కర్ అనే గోల్డెన్ రిట్రీవర్ కేవలం యాడ్స్ ద్వారా ఏడాదిలో $1 మిలియన్ కంటే ఎక్కువ (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 8 కోట్ల 28 లక్షలు) సంపాదిస్తోంది. ఈ డాగ్ యజమానులు కోర్ట్నీ బడ్జిన్ ఆమె భర్త మైక్ దీనిని సంరక్షించడం కోసం ఉద్యోగాలు మానేశారట. 2వ ఏట నుంచే యాడ్స్ ద్వారా సంపాదన మొదలుపెట్టింది టక్కర్. సోషల్ మీడియాలో టక్కర్ కి 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టిక్ టాక్ లో 11.1 మిలియన్లు, ఇన్ స్టా గ్రామ్ లో 3.4 మిలియన్లు, ట్విట్టర్ లో 62,000 ఫాలోవర్లు ఉన్నారట టక్కర్ కి.
ఇక టక్కర్ కి కొడుకు కూడా ఉన్నాడు. నిత్యం వీటిని సంరక్షిస్తూ జీవనం గడుపుతున్నారు వీటి యజమానులు. కోట్లు తెచ్చిపెట్టే కుక్కలు ఉంటే ఇక వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మరి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram