New Continent Amesia : కొత్త ఖండం అమేసియా.. కలిసిపోనున్న ఆసియా, అమెరికా దేశాలు

ఇప్పటివరకు భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. రాబోయే కాలంలో కొత్త ఖండం ఏర్పడనుంది. దాని పేరు ‘అమేసియా’. అయితే ఇది ఇప్పుడు కాదు.. 20 కోట్ల సంవత్సరాల తర్వాత జరుగనుంది. ఆ సమయానికి ఒక మహాసముద్రమే భూమి మీద లేకుండా పోతుంది.

New Continent Amesia : కొత్త ఖండం అమేసియా.. కలిసిపోనున్న ఆసియా, అమెరికా దేశాలు

new continent Amesia

Updated On : October 9, 2022 / 7:45 AM IST

New Continent Amesia : ఇప్పటివరకు భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. రాబోయే కాలంలో కొత్త ఖండం ఏర్పడనుంది. దాని పేరు ‘అమేసియా’. అయితే ఇది ఇప్పుడు కాదు.. 20 కోట్ల సంవత్సరాల తర్వాత జరుగనుంది. ఆ సమయానికి ఒక మహాసముద్రమే భూమి మీద లేకుండా పోతుంది. ఓ 30-40 కోట్ల సంవత్సరాల క్రితం ప్రస్తుతం మనకు తెలిసిన ఖండాలు ఏర్పడ్డాయి. అంతకుముందు అంతా ఒకటే ఖండం ఉండేది. దాన్ని పాంజియా అనేవారు. దాని చుట్టూ ఒకే మహా సముద్రం ఉండేది.

ఆ తర్వాత భూమి ఏడు ఖండాలుగా విడిపోయింది. మహాసముద్రం.. ఐదు సముద్రాలుగా మారింది. మళ్లీ కొత్త ఖండాలు ఎప్పుడు ఏర్పడతాయన్నదానిపై పరిశోధకులు తాజాగా పరిశోధనలు చేపట్టారు. మరో 20 కోట్ల సంవత్సరాల్లో కొత్త ఖండం ఏర్పడుతుందని ‘సూపర్‌ కంప్యూటర్‌’ ద్వారా అంచనాకు వచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన న్యూ కర్టిన్‌ యూనివర్సిటీ, చైనాకు చెందిన పెర్కింగ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఈ పరిశోధన సాగించారు.

‘Gummy Squirrel’in Pacific Ocean : తొక్క తీసిన అరటిపండులా ఉన్న‘సీ కుకుంబర్’ పసిఫిక్‌ సముద్రంలో చిత్రమైన జీవులు గుర్తింపు

పసిఫిక్‌ మహా సముద్రం ఏడాదికేడాది కొన్ని సెంటీమీటర్ల మేర అడుగంటిపోతోంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టగా, ఆ మహా సముద్రం మొత్తం అడుగంటిపోయి, ఒక కొత్త ఖండం ఏర్పడుతుందని తేలింది. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి సుమారు 20-30 కోట్ల ఏళ్లు పడుతుందని తెలిసింది. సముద్ర భూగర్భంలో టెక్టోనిక్‌ ప్లేట్ల సామర్థ్యం తగ్గిపోతుందని, కదలికల్లో మార్పు వస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూమి మీద ఉన్న మహా సముద్రాల్లో పసిఫిక్‌ అతి పెద్దది. అయితే, ఈ మహా సముద్రం తీరం చుట్టూ 24వేల మైళ్ల పొడవున సబ్‌డక్షన్‌ జోన్లు (టెక్టోనిక్‌ ప్లేట్ల కదలిక) ఉన్నాయి. వాటిని రింగ్‌ ఆఫ్‌ ఫైర్స్‌ అంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే 75 శాతం అగ్నిపర్వత విస్ఫోటాలు, 95 శాతం భూకంపాలు పసిఫిక్‌లోనే వస్తాయి. ఫలితంగా పసిఫిక్‌ కేంద్ర బిందువులో భూ భాగం ఎత్తు ఏటా 3-6 అంగుళాలు వ్యాపిస్తోంది.

Mauro Morandi: మనిషి కనిపించకుండా 33ఏళ్ల పాటు అడవిలో గడిపిన 82ఏళ్ల వ్యక్తి కొత్త జీవితం

‘ఆసియా తూర్పువైపుకు అంటే.. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వైపునకు జరుగుతూ పోతుంది. ఈ ఖండాల మధ్య ఉన్న పసిఫిక్‌ మహా సముద్రం ఉండనే ఉండదు. అంటార్కిటికా.. దక్షిణ అమెరికా వైపు కదులుతుంది. ఆసియా ఖండానికి మరోవైపు ఆఫ్రికా వచ్చి చేరుతుంది. ఆస్ట్రేలియా కూడా జత కలుస్తుంది. ఇంకోవైపు నుంచి యూరప్‌ వచ్చి కలిసి.. అమేసియా ఖండం ఏర్పడుతుంది’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఖండాలన్నీ కలిసి ఒక ఖండంగా కలిసే అవకాశం ఉందన్నమాట.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.