News Channel
pornographic video on News channel : అమెరికాలో ఓ న్యూస్ ఛానెల్ లో అశ్లీల వీడియో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. న్యూస్ ఛానెల్ వాతావరణ రిపోర్ట్‌లో అనుకోకుండా 13 సెకండ్ల వ్యవధితో అశ్లీల వీడియో కనిపించింది. న్యూస్ ఛానెల్‌లో అశ్లీల కంటెంట్ ప్రత్యక్షమవ్వడంతో సదరు న్యూస్ ఛానెల్ న్యాయ వివాదంలో కూరుకుపోయింది.
వాషింగ్టన్‌లోని కెర్మ్ 2 న్యూస్ ఛానెల్‌లో ఈనెల 17 సాయంత్రం 6.30 గంటల బులెటిన్‌లో యాంకర్ వాతావరణ రిపోర్ట్ చదువుతుండగా అశ్లీల కంటెంట్ ప్రసారమైంది. వాషింగ్టన్ స్టేట్‌లో వాతావరణం ఆహ్లాదంగా ఉందని మెటియరాలజిస్ట్ మైఖేల్ బాస్ వీక్షకులకు వివరిస్తుండగా స్క్రీన్ కుడివైపు కార్నర్‌లో అశ్లీల కంటెంట్ ప్లే అయింది.
America : కరోనా తర్వాత భారీగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తోన్న అమెరికన్లు
ఈ వీడియోను బాస్ కానీ, ఆమె సహ యాంకర్ కానీ గమనించలేదు. సెన్సార్ చేసిన ఈ క్లిప్ ఆన్‌లైన్‌లో షేర్ చేయగా ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఘటనపై అమెరికన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.