Afghan : ఊరుకో నాన్నా…అఫ్ఘాన్‌ పసికందులను లాలిస్తోన్న విదేశీ సైనికులు

ప్రాణానికి ప్రాణమైన తమ పిల్లలను కాపాడుకోవాలన్న ఆ తల్లుల ఆరాటం చూసి సైనికుల గుండె కరుగుతోంది. అమ్మల గుండెకోత తీర్చడం కోసం.. ఆ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు.

Afghan : ఊరుకో నాన్నా…అఫ్ఘాన్‌ పసికందులను లాలిస్తోన్న విదేశీ సైనికులు

Afghan

Updated On : August 22, 2021 / 10:06 AM IST

Afghan : తాలిబన్ల ఆక్రమణలతో అఫ్ఘానిస్థాన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కరుల అరాచక పాలన నుంచి ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని అఫ్ఘాన్లు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. అయితే తాలిబన్లు వారిని అడ్డుకుని ఎయిర్‌పోర్టుకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు.. కనీసం తమ కన్న బిడ్డల్ని అయినా తాలిబన్ల నుంచి కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇనుప కంచెల పైనుంచే తమ పిల్లలను ఎయిర్‌పోర్టులో ఉన్న అమెరికా, బ్రిటన్‌ దళాలకు అప్పగిస్తున్నారు. ప్రాణానికి ప్రాణమైన తమ పిల్లలను కాపాడుకోవాలన్న ఆ తల్లుల ఆరాటం చూసి సైనికుల గుండె కరుగుతోంది. ఆ అమ్మల గుండెకోత తీర్చడం కోసం.. ఆ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు.

Read More : Petrol Rate : గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

కానీ.. అమ్మానాన్నా కావాలంటూ మారం చేసే ఆ పిల్లలను ఊరడించేదెవరు..? బందోబస్తుతో పాటు ఆ పని కూడా చేస్తున్నారు విదేశీ సైనికులు. అనాథలుగా మారిన ఆ పిల్లలకు అన్నీ తామే అయ్యారు. కుటుంబాలకు దూరంగా కల్లోల ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ సైనికులు.. ఈ పసిపాపల బోసినవ్వులు చూడగానే తమ బిడ్డలను గుర్తుచేసుకుంటున్నారు. అఫ్ఘాన్‌ వాసుల పిల్లలను సైనికులు ఎత్తుకుని ఆడిస్తున్న చిత్రాలు, వారికి సాయం చేస్తున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.

Read More : Taliban : పైశాచికత్వం.. వంట బాలేదని మంటల్లో వేశారు

ఓ సైనికుడు తన చేతుల్లోకి ఓ పసికందును తీసుకుని తండ్రి లాలిస్తూ.. ఆ బోసినవ్వులు చూసి మురిసిపోతున్నాడు. కాబుల్ విమానాశ్రయంలో ఓ పసికందును ఇనుప కంచెపై నుంచి సైనికులు తీసుకుంటున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అయితే లోపలికి అనుమతి లేకపోవడంతో గేటు వద్ద నిరీక్షించారు. ఆ సమయంలో చిన్నారి అనారోగ్యానికి గురవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అమెరికా దళాల సాయం కోరారు. వెంటనే స్పందించిన యూఎస్‌ భద్రతా సిబ్బంది ఆ చిన్నారిని కంచెపై నుంచి తీసుకుని ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Read More : Raksha Bandhan : రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్

అక్కడ చిన్నారికి చికిత్స అందించిన అనంతరం ఆ శిశువును తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు కాబుల్ ఎయిర్‌పోర్టు లోపల తిండీతిప్పలు లేక ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకూ తమతో ఉన్న చిన్నారి విగత జీవిగా మారిపోయే సరికి… ఆ తండ్రి గుండె పగిలిపోయింది. బిడ్డ మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు… తాలిబన్లు రాసిన తలరాతను తలచుకుంటూ కుములికుమిలి ఏడ్చాడు. కల్లోల పరిస్థితుల్లోనూ అమెరికా, బ్రిటన్ దళాలు మానవతా దృక్పథంతో ఆలోచించి అఫ్ఘాన్ చిన్నారులకు సాయం చేసిన తీరు ప్రశంసనీయమే. విదేశీ సైనికుల సాయం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.