Taliban Cancel EC : ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసిన తాలిబన్ల ప్రభుత్వం
అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఇటువంటి వ్యవస్థలు అవసరం లేదని అందుకే రద్దు చేశామని తెలిపారు.

Taliban Govt Cancel Ec
Taliban scraps election commission : అఫ్ఘానిస్థాన్ ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు మరో సంచనల నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తాలిబన్లు ఎన్నికల కమిషన్ ను రద్దు చేశారు. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి (డిప్యూటీ) బిలాల్ కరీమి ఆదివారం (డిసెంబర్ 26,2021) ప్రకటించారు
ప్రస్తుత తరుణంలో అఫ్గాన్‌లో ఎన్నికల వ్యవస్థ అనవసరం భావించామని అందుకే ఎన్నికల కమిషన్ ను రద్దు చేశామని తెలిపారు. కానీ భవిష్యత్తులో అవసరమని అనిపిస్తే..పునరుద్ధరిస్తామని ఇస్లామిక్ ఎమిరేట్ పునరుద్ధరిస్తుందని కరీమీ తెలిపారు.అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నామని కూడా బిలాల్ తెలిపారు.
Read more : Afghan Women: మగతోడు లేకుండా మహిళల ప్రయాణం వద్దనడానికి కారణమిదే
తాలిబన్లు తీసుకున్న ఈ నిర్ణయంపై గత పాలనలో ప్యానెల్ కు నాయతకత్వం వహించిన ఔరంగజేబ్ మాట్లాడుతు..”తాలిబన్లు తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నారని..కమిషన్‌ను రద్దు చేయడం వలన భారీ పరిణామాలు ఉంటాయి” అన్నారు.
అలాగే సీనియర్ రాజకీయ నాయకుడు హలీమ్ ఫిదాయ్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు అంటే తాలిబాన్‌లకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని..అందుకే ఎన్నికల కమిషన్ ను రద్దు చేశారని తాలిబన్ల నియంతృత్వ పాలనకు ఇదో ఉహరణ అనుకోవాలని అన్నారు.
Read more : Covid-19: కొవిడ్ మూడో డోసు కూడా అదే అయి ఉండాలి