లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక

  • Published By: venkaiahnaidu ,Published On : April 26, 2019 / 01:38 AM IST
లంక తగలబడుతోంది : 39 దేశాలకు వీసాల జారీ నిలిపివేసిన శ్రీలంక

Updated On : April 26, 2019 / 1:38 AM IST

వరుస బాంబు పేలుళ్ల ఘటనతో భద్రతా కారణాల దృష్యా 39 దేశాలకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-25,2019) శ్రీలంక పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

కొన్ని రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి జాన్‌ అమరతుంగ తెలిపారు. వరుస బ్లాస్ట్ లకు పాల్పడిన నిందితులకు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలున్నాయని విచారణలో తేలిందని, మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Also Read : శ్రీలంకలో మళ్లీ ఉగ్రదాడులు : అమెరికా హెచ్చరిక

శ్రీలంక ప్రకృతి అందాలను చూసేందుకు ఏటా అక్కడికి లక్షల్లో పర్యాటకులు వెళుతుంటారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 7లక్షల 40వేల 600 మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్లారు. గతేడాది 4లక్షల 50వేల మంది భారతీయులు శ్రీలంకను సందర్శించారు. ఇక 2019 భారతీయ పర్యాటకులు 10 లక్షల మార్కును చేరుకుంటారని ఆ దేశ పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.

శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటివరకు 359 మంది చనిపోగా, 500 మంది పైగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి 139మంది అనుమానితులుగా గుర్తించినట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు.
Also Read : శ్రీలంకలో పేలుళ్ల దర్యాప్తు : ఆరుగురు అనుమానితుల ఫొటోలు రిలీజ్