Brazil cyclone : బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్…50 మంది అదృశ్యం

బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్ సంభవించింది. బ్రెజిల్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో తుపాన్ ప్రభావంతో కుండపోత వర్షం, వరదలు సంభవించాయి. విధ్వంసక తుపాను తర్వాత బ్రెజిల్ రెస్క్యూ వర్కర్లు గల్లంతైన 50 మంది వ్యక్తుల కోసం వెతుకుతున్నారు....

Brazil cyclone : బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్…50 మంది అదృశ్యం

Brazil cyclone

Updated On : September 9, 2023 / 6:18 AM IST

Brazil cyclone : బ్రెజిల్ దేశంలో భారీ తుపాన్ సంభవించింది. బ్రెజిల్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో తుపాన్ ప్రభావంతో కుండపోత వర్షం, వరదలు సంభవించాయి. విధ్వంసక తుపాను తర్వాత బ్రెజిల్ రెస్క్యూ వర్కర్లు గల్లంతైన 50 మంది వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. కొండలపై అక్రమంగా నిర్మించిన భవనాలు ప్రాణాంతకంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ విపత్తు వల్ల 41 మంది మరణించారు. (Brazil cyclone) వరదల ధాటి వలల 223 మంది గాయపడ్డారు.

Morocco : మొరాకోలో భారీభూకంపం…రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే…

వరద ముంపు ప్రాంతంలో 11వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 హెలికాప్టర్లు, 1000 మంది రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. (50 people missing after deadly Brazil cyclone) తుపాన్ ప్రభావం వల్ల రెండు వంతెనలు, పలు రోడ్లు ధ్వంసం అయ్యాయి. 8 సైనిక విమానాలు, వందలాది మంది సైనికులు కూడా సెర్చ్ అండ్ రెస్క్యూలో పాల్గొంటున్నారు.

G20 Summit 2023 : మోదీ, జోబిడెన్ ద్వైపాక్షిక సమావేశంలో ఏఐ, సైన్స్, డిఫెన్స్ అంశాలపై చర్చ

తుపాన్ బాధితులు 20వేలమందికి ఆహారం, ఔషధాలను అందించారు. బ్రెజిల్ దేశంలో తుపాన్ విపత్తు వల్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించామని అల్క్ మిన్ బ్రెసిలియాలో ప్రకటించారు. తుపాన్ వల్ల ఇళ్లు దెబ్బతినడంతో బాధితులకు ఆర్థిక సాయం అందించారు. వాతావరణ మార్పుల వల్ల బ్రెజిల్ దేశంలో తరచూ తుపాన్లు వస్తున్నాయని చెబుతున్నారు.