యూకేలో అమెరికా నల్లజాతీయుడు ఫ్లాయిడ్ చాలెంజ్‌లు: సోషల్ మీడియాలో పోస్టులు

అమెరికాలో నల్ల జాతీయుడు 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్ పై శ్వేతజాతీయుడైన పోలీసలు అమానుషంగా ప్రవర్తించటంతో అను ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికాలో తీవ్ర నిరసనలు మిన్నంటుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పలేదు.
ఇదిలా ఉంటే శ్వేత జాతీయుడు అరాచకానికి ప్రాణాలు కోల్పోయిన ఫ్లాయిడ్ పేరుతో కొంతమంది తమ పైశాచికాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయింది నల్లవాడా? లేక తెల్లవాడా అనేది కాదు కావాల్సింది. అక్కడ పోయింది ఓ నిండు ప్రాణం. ఆ ప్రాణం పోయిన తీరుపై సాటి మనుషులుగా స్పందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది ఖండించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. కానీ ఓ ప్రాణం పోవటానికి కారణమైన అమెరికా కర్కశంగా ఖాకీలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. దీన్ని సోషల్ మీడియా వేదికగా తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు యూకేలో కొంతమంది.
అమెరికా పోలీసులు ఎలాగైతే ఫ్లాయిడ్‌ను నేలపై బోర్లా పడుకోబెట్టి మెడపై కాలితో నొక్కి పట్టారో.. అదే విధంగా యూకేలో ఫ్లాయిడ్ చాలెంజ్ పేరిట చాలా మంది అలాగే చేస్తూ ఫొటోలు దిగుతూ, వీడియోలు షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫ్లాయిడ్ చాలెంజ్‌ను చేపడుతూ సోషల్ మీడియాలో తమ స్నేహితులకు చాలెంజ్‌లు విసురుతున్నారు.
అయితే ఈ కలకలంపై యూకే పోలీసులు స్పందించి ఆ చాలెంజ్‌లు చేసే వారిని వెంటనే అరెస్టు చేస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటువంటి పనులు చేస్తే జైలు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.
అయినాసరే కొందరు తమ సైకోలు తమ శునకానందాన్ని ప్రదర్శిస్తున్నారు. వర్ణ వివక్ష కారణంగా ఓ నల్ల జాతీయున్ని అమెరికా తెల్ల జాతీయులు చంపితే దానికి సానుభూతి తెలపాల్సింది పోయి.. ఇలా సిగ్గు లేకుండా చాలెంజ్‌లు చేయడం ఏమిటని.. కొందరు ప్రశ్నిస్తున్నారు. ఛీ..వీళ్లసలు మనుషులేనా? అని తిట్టిపోస్తుంటే..ఇటువంటి సైకోలు అస్సలు మారరని..దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటివాళ్లు సమాజానికి చేటు తెచ్చేవారేనంటున్నారు.
Read: అమెరికాలో నిరసన సెగలు : కొత్త నినాదం..8 నిమిషాల 46 సెకన్లు