American Astronaut Wished : అంతరిక్షం నుంచి అమెరికా వ్యోమగామి రాజాచారి..భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్‌ వ్యోమాగామి రాజా చారి ట్విట్టర్‌లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల తెలిపారు. అంతేకాకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు.

American Astronaut Wished : అంతరిక్షం నుంచి అమెరికా వ్యోమగామి రాజాచారి..భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

American astronaut Independence Day wish

Updated On : August 15, 2022 / 6:23 PM IST

American Astronaut Independence Day Wish : భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్‌ వ్యోమాగామి రాజా చారి ట్విట్టర్‌లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల తెలిపారు. అంతేకాకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు.

రాజాచారి ఇటీవల ఐఎస్‌ఎస్‌లో ఆరునెలల మిషన్‌ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్‌ చేసిన స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమగాములలో అతను కూడా ఉ‍న్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటున్నానని రాజాచారి చెప్పారు.

Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఆరు ఖండాల్లో ఎగిరిన భారత జెండా

వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్‌ ఈ రోజు మెరిసిపోతుందన్నారు. యూఎస్‌లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్‌కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. తాను యూఎస్‌లోని ఇండియన్‌ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.