Afghanistan : తాలిబన్లతో అమెరికా రహస్య స్నేహం బట్టబయలు

తాలిబన్లు అమెరికా మధ్య ఉన్న రహస్య స్నేహం బయటపడింది. అమెరికా అత్యున్నత నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ కాబూల్‌ లో తాలిబన్ అగ్ర నేత ముల్లా బరదార్‌ను కలిశారు.

Afghanistan : తాలిబన్లతో అమెరికా రహస్య స్నేహం బట్టబయలు

Afghanistan (2)

Updated On : August 24, 2021 / 7:27 PM IST

Afghanistan : తాలిబన్లు అమెరికా మధ్య ఉన్న రహస్య స్నేహం బయటపడింది. అమెరికా అత్యున్నత నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్స్ కాబూల్‌ లో తాలిబాన్ అగ్ర నేత ముల్లా బరదార్‌ను కలిశారు. వీరి భేటీతో ప్రపంచ దేశాలు షాక్ కి గురయ్యాయి. సోమవారం జరిగిన భేటీలో వీరిమధ్య కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ చర్చలో అమెరికా సైన్యం తరలింపుపై కూడా మాట్లాడి ఉంటారని అఫ్ఘాన్ పరిస్థితులను ప్రపంచానికి చెబుతున్న ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

అయితే వీరి రహస్య మైత్రిపై స్పష్టమైన విషయాలు బయటకు రాలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థలు రాసిన కథనాల్లో అమెరికా తాలిబన్లతో రహస్య మైత్రి కొనసాగిస్తుందని తెలిపారు. ఈ భేటీలో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికన్ పౌరుల తరలింపు గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

అమెరికా పౌరులు అందరిని తరలిస్తున్నా సరే సైన్యంను ఉపసంహరించుకుంటారా లేదా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. కాబూల్ నుండి తన పౌరులను తరలించే ఆపరేషన్ చాలా సవాలుగా మరియు కష్టమైన పనిగా బిడెన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.