Dangerous Variant: ప్రమాదకరమైన కరోనా కొత్త వేరియంట్.. ఇప్పటివరకు 12 మందికి సోకింది
ఒకవైపు ఒమిక్రాన్ ప్రభావంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కరోనాకు సంబంధించి మరో కొత్త వేరియంట్ కంగారు పెట్టేస్తోంది.

New Variant
Dangerous Variant: ఒకవైపు ఒమిక్రాన్ ప్రభావంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కరోనాకు సంబంధించి మరో కొత్త వేరియంట్ కంగారు పెట్టేస్తోంది. వేగంగా మారుతున్న కొత్త వేరియంట్ స్వభావం మరింత ప్రమాదకరం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వేరియంట్ పేరు IHU. ఇప్పటివరకు 12 మందికి కొత్త వేరియంట్ సోకింది. కొత్త వేరియంట్ ఫ్రాన్స్‌లో గుర్తించబడింది. ఫ్రాన్స్‌లో గుర్తించిన కొత్త వేరియంట్ B.1. 640.2ని ‘IHU’గా చెబుతున్నారు.
IHU మెడిటరేనియన్ ఇన్‌ఫెక్షన్‌ను ఇప్పటివరకు 12మందిలో గుర్తించినట్లు ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ఆఫ్రికన్ దేశం కామెరూన్ పర్యటనకు వెళ్లిన కొందరిలో ఈ వేరియంట్ గుర్తించగా.. ఈ ఇన్ఫెక్షన్ గురించి పూర్తి వివరాలు బయటకు వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. వ్యాక్సిన్‌ల ద్వారా ఈ వేరియంట్ నుంచి రక్షణ పొందవచ్చునా? అనే విషయానికి వస్తే, అప్పుడే చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు.
ఈ వేరియంట్‌కు సంబంధించిన ప్రాధమిక అధ్యయనం ప్రకారం.. IHUలో 46 మార్పులు(Alterations), 37పర్‌మ్యుటేషన్స్ ఉన్నాయని, ఫలితంగా 30 అమైనో యాసిడ్ రీప్లేస్‌మెంట్‌లు, 12 తొలగింపులు(Deletions) ఉన్నాయని వెల్లడైంది. అమైనో ఆమ్లాలు అణువులు, ప్రోటీన్లను ఏర్పరుస్తాయని, రెండూ జీవితానికి బిల్డింగ్ బ్లాక్స్
లాంటివి అని వెల్లడించారు.
ప్రస్తుతం వాడుకలో ఉన్న చాలా వ్యాక్సిన్‌లు SARS-Cov-2 స్పైక్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని, ఈ వైరస్‌లు ప్రోటీన్‌లను లక్ష్యంగా చేసుకుని కణాలలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్ ఎక్కువ అయ్యేందుకు కారణం అవుతున్నట్లు చెబుతున్నారు. N501Y, E484K మ్యూటేషన్స్ గతంలో బీటా, గామా, తీటా మరియు ఓమిక్రాన్ వేరియంట్‌లలో కూడా కనుగొనబడ్డాయి.
ఫ్రాన్స్‌లో మాత్రమే ఇప్పటివరకు ఈ వేరియంట్ కనుగొనగా.. మిగిలిన ఏ దేశంలోనూ B.1.640.2ను గుర్తించలేదు. ఈ వేరియంట్ గురించి విచారణ స్థాయిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఉంది. భారత్‌తో సహా చాలా దేశాలు కరోనా ఓమిక్రాన్ రూపం విజృంభించడంతో ఇబ్బంది పడుతున్నాయి. గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో ఈ రూపం గుర్తించబడింది. అప్పటి నుంచి Omicron 100 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు, భారతదేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1892 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.