పాము కాదు, స్పైడర్ కాదు…మరో వింత జీవి

పాము కాదు, స్పైడర్ కాదు…మరో వింత జీవి

Strange Creature

Updated On : May 18, 2021 / 2:12 PM IST

ప్రకృతి గురించి ఎవ‌రూ పూర్తిగా చెప్పలేరు. ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో ఎవరికి తెలియ‌దు. అవి జ‌రిగిన‌ప్పుడు చూడాల్సిందే. అసలు ప్రకృతిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఎవరికి తెలియకపోవచ్చు. కొన్ని రకాల జీవులను ఎప్పుడు మనం చూసి ఉండం. అలాంటి జీవులు ఉన్నాయనేది కూడా మనకు తెలిసి ఉండదు. అలా ఉంటాయి ఆ వింత జీవులు. సోషల్‌ మీడియా పుణ్యమా అని కొన్ని వింత జీవులను మనం చూడగల్గుతున్నాము. తాజాగా సోషల్‌ మీడియాలో మరో వింత జీవికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయింది. ఈ అసాధరమైన జీవి పేరు ఎంటో నెటిజన్లు కనుక్కోలేకపోతున్నారు.

పాము, సాలీడును పోలి ఉన్న ఈ జీవి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. వీడియో చూసి మొదట్లో ఇది పాము అని భావిస్తాం. కానీ కాసేపటి తర్వాత పాము కాదని తెలుస్తోంది. సాలీడు అనుకుంటే అదీ కాదు. ఐదు కాళ్లతో పాకుతూ ఆ జీవి కొలనులోకి వెళ్లిపోతుంది. 32 సెకండ్ల నిడివిగల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.9 లక్షల వ్యూస్‌ వచ్చాయి.

ఈ వింత జీవి వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇది 2020 కాలం, అందుకే ఈ అద్భుతం’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ‘ ఐదు పాములు కలిసి ఒక తాబేలు తినడానికి ప్రయత్నించగా, అది తప్పించుకోని కొలనులోకి వెళ్లింది’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. దీని పేరు ‘స్నేక్‌ స్పైడర్‌’ అని ఇంకో నెటిజన్‌ నామకరణం చేశాడు.

Read: తెరుచుకున్న థియేటర్లు.. సీట్ల మధ్యలో మినియన్స్ బొమ్మలు