కరోనా ఆసుపత్రిలో మంటలు.. పది మంది మృతి

కరోనా వైరస్ సోకిన ప్రజలు చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రి ICU వార్డులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 10మంది రోగులు మరణించారు.
ఈ అగ్నిప్రమాదంలో రెండు గదులు పూర్తిగా కాలిపోయాయని, 16 మంది రోగులు అందులో ఉండగా.. 10 మంది మృతి చెందారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఈ ఘటన రొమేనియా దేశంలో పియాట్రా నీమ్ట్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఉత్తర నగరమైన పియాట్రా నీమ్ట్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో COVID-19 రోగులతో నియమించబడిన ఇంటెన్సివ్ కేర్ వార్డ్ ద్వారా షార్ట్‌సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయని స్థానిక అత్యవసర పరిస్థితుల ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మినహా మరణించిన, గాయపడిన వారందరూ ఆసుపత్రి రోగులేనని అధికారులు చెప్పారు.