అమెరికా హిందూ దేవాలయంపై దాడి

అమెరికా : అమెరికా కెంటకీలో హిందూ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కెంటకీలోని లూయిస్ విల్లే నగరంలో ఉన్న స్వామి నారాయణ్ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఆలయం గోడలు, దేవుడి విగ్రహాలపై నల్ల పెయింట్ పోశారు. గుడిలో ఉన్న ఓ కుర్చీలో కత్తిని గుచ్చి వెళ్లారు. కిటికీలను పగలగొట్టారు. గ్రాఫిటీతో గోడల మీద వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. దీనిని హేట్ క్రైమ్ గా కేసు పెట్టి అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోడలపై స్ప్రే పెయింట్‌తో అనుచిత వ్యాఖ్యలు రాసారని స్థానిక మీడియా తెలిపింది. జీసస్ మాత్రమే దేవుడనే వ్యాఖ్యలను గోడలపై రాసినట్టు సోషల్ మీడియాలోని ఫొటోలను బట్టి తెలుస్తోంది. గ్రాఫిటీతో గోడల మీద వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. దీనిని హేట్ క్రైమ్ గా కేసు పెట్టి అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసి, లూయిస్ విల్లే నగర మేయర్ జార్జ్ ఫిస్చెర్ ఆలయాన్ని సందర్శించారు. ఇటువంటి ద్వేషపూరిత చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలను తమ నగరం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలంతా మరింత ఐక్యతతో ఉండాలని సూచించారు. ఏ మతం వారైనా ఇలా చేయడం తగదని, తాము శాంతి కోసం నిలబడతామని ఆలయ అధికారులు చెప్పారు.గోడలపై స్ప్రే పెయింట్‌తో అనుచిత వ్యాఖ్యలు రాసారని స్థానిక మీడియా తెలిపింది. జీసస్ మాత్రమే దేవుడనే వ్యాఖ్యలను గోడలపై రాసినట్టు సోషల్ మీడియాలోని ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఈ ఘటన కెంటకీలోని భారతీయులను కలచి వేసింది. అమెరికా అధికారులు దర్యాప్తు చేపట్టారు. బ్రాడ్స్‌టౌన్ రోడ్‌లో ఉన్న స్వామినారయణ్ ఆలయాన్ని సందర్శించిన లూయిస్‌విల్లే మేయర్ గ్రెస్ ఫిస్చెర్ ఈ ఘటనను ఖండించారు.