కరోనా వ్యాక్సిన్.. ప్రీ క్లినికల్ టెస్టింగ్ ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : April 2, 2020 / 01:29 PM IST
కరోనా వ్యాక్సిన్.. ప్రీ క్లినికల్ టెస్టింగ్ ప్రారంభం

Updated On : April 2, 2020 / 1:29 PM IST

కరోనా మహమ్మారిని చంపేందుకు ప్రపంచవ్యాప్తంగా పరశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ప్రీ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడంలో భాగంగా టెస్టులు నిర్వహించామని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ప్రాథమిక దశ కంప్లీట్ అవ్వడానికి 3నెలలు టైం పడుతోందని అంచనా వేస్తున్నారు. 

వచ్చే ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని. కాకపోతే ముందు ప్రకటించినట్టుగా వ్యక్సిన్‌ను 18నెలల్లో తయారు చేస్తామని కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్స్ ఆర్గనైజేషన్ డైరక్టర్ గ్రెన్‌ఫెల్ వెల్లడించారు. పరిశోధనలు ప్రారంభించి ఇప్పుడు కేవలం 8వారాలే అవుతోంది. అప్పుడే ప్రీ క్లీనికల్ దశకు చేరుకున్నాం.. అసలైతే ఈ దశకు చేరుకోవాలంటే కచ్చితంగా 2సంవత్సరాలు పడుతోందని తెలిపారు.

దీని ద్వారా శాస్త్రవేతలు ఎంత కష్టపడుతున్నారో అర్ధమౌతోంది అని గ్రెన్ ఫెల్ తెలిపారు. ఈ వైరస్ కు సంబంధించి చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ అన్నీ దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ లో ఉందని తెలుస్తోందని తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 8 లక్షల 60 వేలు దాటింది. అందులో 47వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read | కరోనా కట్టడి ఇలా చేస్తున్నాం – ఏపీ సీఎం జగన్