బాబోయ్ : Avengers Endgame Climax చెప్పినందుకు రక్తం వచ్చేలా కొట్టారు

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 06:41 AM IST
బాబోయ్ : Avengers Endgame Climax చెప్పినందుకు రక్తం వచ్చేలా కొట్టారు

Updated On : April 28, 2019 / 6:41 AM IST

అవును నిజమే.. అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లయిమాక్స్ చెప్పినందుకు అతడిని చితక్కొట్టారు. రక్తం కారేలా కొట్టారు. చైనాలోని హాంగ్ కాంగ్ లో ఈ ఘటన జరిగింది. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్‌ హీరో సిరీస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌కు వరల్డ్ వైడ్ గా విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. సూపర్‌ హీరో సిరిస్‌ను ఎలా ముగించారో అని సినీ ప్రియులు.. ముఖ్యంగా అవెంజర్స్‌ అభిమానులు సినిమా చూసేందుకు ఆత్రుతగా ఉన్నారు. ఇలాంటి సిట్యుయేషన్ లో సినిమా కథ గురించి ముందే చెప్పి చావు దెబ్బలు తిన్నాడో ప్రబుద్దుడు.

సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఓ వ్యక్తి తన ఉత్సాహం ఆపుకోలేక సినిమా క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో అందరికీ చెప్పేశాడు. సినిమా హాల్ బయట ఆ వ్యక్తి బిగ్గరగా అరుస్తూ సినిమా క్లైమాక్స్ మొత్తం చెప్పేయడంతో అక్కడున్న ఫ్యాన్స్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సినిమా క్లైమాక్స్ చెబితే.. ఇక థ్రిల్ ఏముంటుంది అంటూ అభిమానులు అతడిని చావగొట్టారు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హాంగ్ కాంగ్ లోని కాజ్వే బేలోని సినిమా థియేటర్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. కష్టపడి, క్యూలైన్లలో గంటల కొద్దీ నిలబడి టికెట్లు సంపాదించుకున్నామని, అలాంటిది తమ ఆనందాన్ని ఆవిరి చేస్తామంటే ఊరుకుంటామా అని ఫ్యాన్స్ మండిపడ్డారు.

చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో బుధవారం (ఏప్రిల్ 24,2019) విడుదలైన అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌.. భారత్ లో శుక్రవారం (ఏప్రిల్ 26,2019) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు క్రేజ్‌ మాములుగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సృష్టించిందీ సినిమా. తొలి వారాంతానికి రూ.6వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గత చిత్రాల రికార్డులన్ని చెరిపేసి 20వేల కోట్ల వసూళ్లతో ఆల్‌టైం రికార్డ్‌ సెట్ చేయటం ఖాయం అంటున్నారు.