Bag of Air : ప్లాస్టిక్ కవర్ లో గాలి నింపి రూ.5లక్షలకు అమ్మేన ఘనుడు..దీన్ని కొన్నవాళ్లవాళ్లు ఏం చేసుకుంటారో ?!

ప్లాస్టిక్ కవర్ లో గాలి నింపి దాన్ని ఏకంగా రూ.5లక్షలకు అమ్మేశాడు ఓ ఘనుడు. అట్లాంటాలో జరిగిన వేలంలో గాలి నింపిన ప్లాస్టిక్ కవర్ కొనుగోలు గురించి తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Bag of Air : ప్లాస్టిక్ కవర్ లో గాలి నింపి రూ.5లక్షలకు అమ్మేన ఘనుడు..దీన్ని కొన్నవాళ్లవాళ్లు ఏం చేసుకుంటారో ?!

Air Bag

Updated On : August 7, 2021 / 11:06 AM IST

Bag of Air for sale : అమ్మకానికి ఏదీ అనర్హం కాదు అన్నట్లుగా ఉంది. లేదంటే గాలిని అమ్మటమేంటీ? అదేంటీ గాలికి కంటికే కనిపించదు మరి దాన్ని ఎలా అమ్ముతారు? అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. కానీ ఓ వ్యక్తి అంతటి ఘనకార్యమే చేశాడు. ఓ ప్లాస్టిక్ కవర్ లో గాలిని నింపి దాన్ని వేలంలో పెట్టి ఏకంగా రూ. లక్షలకు అమ్మేశాడు. ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్‌ లో గాలిని నిపించి ఆ గాలి కవర్ ను ఏకంగా 5. ల‌క్ష‌ల‌కు అమ్మ‌ేశాడు. గాలిని అమ్మటమే ఓ ఘనకార్యం అనుకుంటే దాన్ని కొనటం మరీ విడ్డూరం కదా. మరి గాలి కవర్ కు అంత డిమాండ్ ఎందుకు. బ‌య‌ట కావాల్సినంత గాలి ఉంటుంది క‌దా…దాన్ని ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో బంధించి మరీ అమ్మాల్సిన అవ‌స‌రం ఏంటి? దాన్ని కొనాల్సిన అవసరం ఏంటీ అనుకుంటాం. అట్లాంటాలో జరిగిన ఈ వేలం గురించి తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ గాలి ప్లాస్టిక్ క‌వ‌ర్ అమ్మకం..కొనటం క‌థాకామీషు ఏంటో తెలుసుకుందాం రండి.

ఆ ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో ఉన్న గాలి.. ఎక్క‌డిదో తెలుసా? డొండా డ్రాప్ అనే ఒక ఈవెంట్‌కు సంబంధించింది. డొండా డ్రాప్ అంటే అదేదో ప‌చ్చ‌ని చెట్లు ఉండే అడ‌వి ప్రాంతం కాబోలు.. ఆ గాలిని పీల్చుకుంటే రోగాల‌న్నీ మాయం అవుతాయి కాబోలు అని మీలో మీరే ఊహించేసుకోకండి. ఎందుకంటే.. అది ఒక క‌న్స‌ర్ట్‌కు సంబంధించిన ఈవెంట్ ద‌గ్గ‌ర నింపిన గాలికి సంబంధించిన క‌వ‌ర్.

ప్రముఖ ఫేమ‌స్ అమెరిక‌న్ పాప్ స్టార్ క‌న్యె వెస్ట్ తెలిసే ఉంటుంది. ఆయ‌న పాప్ సింగ‌ర్, ర్యాప‌ర్ కూడా. యూఎస్‌లో క‌న్యె వెస్ట్ అంటే ప‌డి చ‌చ్చిపోతారు జ‌నాలు. ఆయ‌న రాప్ సాంగ్స్ పాడితే దుమ్ము లేచిపోవాల్సిందే. త్వ‌ర‌లో డొండా అనే ఒక ఆల్బమ్‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోతున్నారు. దాని కోసం ప్రివ్యూ క‌న్స‌ర్ట్‌ను అట్లాంటాలోని మెర్సిడిస్ బెంజ్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. జులై 22న క‌న్స‌ర్ట్‌ను ఏర్పాటు చేయ‌గా.. ఒక వ్య‌క్తి ఆ కన్స‌ర్ట్‌కు వెళ్లి.. ఆక్క‌డ స్టేడియంలో గాలిని ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో నింపి దాన్ని ఈబేలో వేలం వేశాడు.

ఇది కెన్యె వెస్ట్ క‌న్స‌ర్ట్ నుంచి తీసుకొచ్చిన గాలి.. అంటూ క్యాప్ష‌న్ పెట్టి వేలం వేయటంతో దాన్ని కొనటానికి జ‌నాలు ఎగ‌బడ్డారు. అలా ఆ గాలి నింపిన ప్లాస్టిక్ కవర్ని ఓ వ్య‌క్తి 7,600 డాలర్ల‌కు కొనుగోలు చేశాడు. అంటే మ‌న క‌రెన్సీలో 5,64,235 రూపాయ‌లు అన్న‌మాట‌. విచిత్రంగా ఉంది క‌దా. ఇంత‌కీ దాన్ని కొన్న వ్య‌క్తి ఆ గాలిని ఏం చేసుకుంటాడంటారు..అదే పెద్ద డౌటు జనాలకు..ఎవరి పిచ్చి వారికి ఆనందమంటే ఇదేనేమో!