Bangladesh Violence : మళ్లీ రక్తమోడుతున్న బంగ్లాదేశ్.. నిరవధిక కర్ఫ్యూ.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

1971 బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 30శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని అందరికి సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ

Bangladesh Violence : మళ్లీ రక్తమోడుతున్న బంగ్లాదేశ్.. నిరవధిక కర్ఫ్యూ.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

Bangladesh Violence

Bangladesh Violence : బంగ్లాదేశ్ లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన  ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో దాదాపు వంద మందికిపైగా మరణించారు. వందల మంది గాయపడ్డారు. దీంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. ప్రధాన మంత్రి పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలని స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ సంస్థ డిమాండ్ చేస్తుంది. రిజర్వేషన్ల సవరణ ఆందోళనలతో నెల రోజులుగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడంతోపాటు.. వాహనాలను తగలబెడుతున్నారు. దీంతో బంగ్లా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది.. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించింది. ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లపై నిషేధం విధించింది.

Also Read : జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది.. కుమార్తెను హత్తుకొని కన్నీటి పర్యంతమైన టెన్నిస్ స్టార్.. వీడియో వైరల్

ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 91 మంది మృతి చెందగా.. వందల మందికి గాయాలయ్యాయి. బంగ్లాదేశ్‌లోని ఉత్తర జిల్లాలు బోగ్రా, పబ్నా, రంగపూర్ సహా దేశవ్యాప్తంగా మరణాలు సంభవిస్తున్నాయి. నెల రోజులుగా రిజర్వేషన్ల ఆందోళనల్లో ఇప్పటివరకు 280 మందికిపైగా మృరణించారు. గత రెండు వారాల్లో 10,000 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టయిన వారిలో విద్యార్థులు, బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఉన్నారు. బంగ్లాదేశ్ పోలీసులు నిరసనకారులను అణిచివేస్తున్నారు.

Also Read : వయనాడ్ తర్వాత ముప్పు ఉన్న ప్రాంతాలు ఇవేనా, ప్రళయం ముంచుకు రానుందా?

1971 బంగ్లాదేశ్ పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 30శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని అందరికి సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై రిజర్వేషన్ల ఆందోళనలు మొదలయ్యాయి. పన్నులు, వినియోగదారుల బిల్లులు చెల్లించవద్దని, ప్రజారవాణా ఆపేయాలని, అన్ని ఫ్యాక్టరీలు మూసివేయాలని, పనులకు హాజరుకాకూడదని బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ ప్రజలను కోరింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ అధికారంలోఉంది. జనవరిలో నాలుగోసారి షేక్ హసీనా ప్రధానిగా ఎన్నికయ్యారు.

బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారత పౌరులను భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. భారత అసిస్టెంట్ హైకమిషన్ పరిధిలోఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు తమ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచన చేసింది. నెలరోజులుగా ఆ దేశంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే 10వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు భారత దేశంకు చేరుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాలను నిలిపివేసుకోవాలని కేంద్రం సూచించింది. తదుపరి తమ నుంచి ప్రకటన వచ్చే వరకు బంగ్లాదేశ్ కు వెళ్లవద్దని భారతీయులకు కేంద్రం సూచించింది.