ఎలా ఉండే..ఎలా అయిపోయింది : చైనాలో దెయ్యాల్లా పట్టణాలు

  • Published By: madhu ,Published On : February 9, 2020 / 09:25 AM IST
ఎలా ఉండే..ఎలా అయిపోయింది : చైనాలో దెయ్యాల్లా పట్టణాలు

Updated On : February 9, 2020 / 9:25 AM IST

ఎప్పుడూ..రద్దీగా ఉండే..ప్రాంతాలు..పర్యాటకులతో కిక్కిరిసిపోతుండేవి..రెస్టారెంట్లు..బార్లలలో జనాలతో సందడి సందడిగా ఉండేది..మంచు కురుస్తున్న సందర్భంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పట్టణాలు..ఇప్పుడు దెయ్యాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఏ దేశం గురించి చెబుతున్నామో అర్థమై ఉంటుంది కదా..అదే చైనా..దేశం..కరోనా వైరస్ బారిన పడి వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.. వేలాది మందికి ఈ వైరస్ సోకి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ప్రధాన పట్టణాలు..నిర్మానుష్యంగా మారిపోయాయి. కేవలం..మాస్క్‌లు ధరించిన పోలీసులు, సెక్యూర్టీ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. 

చైనా రాజధాని బీజింగ్‌లోని ఫర్బిడెన్ సిటీ సమీపంలో ఉన్న జింగ్ షాన్ పార్కు ఎంతో ప్రాముఖ్యతగలది. ఇక్కడ ఎప్పుడూ కురవని మంచు కురిసింది. ఈ ప్రాంతానికి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. కేవలం పక్షుల కిలకిల శబ్దాలు మాత్రమే వినిపడుతున్నాయి. ఎందుకంటే..కరోనా వైరస్. దీని కారణంగా ఎవరూ బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో దెయ్యాలుగా మారిపోయాయి పట్టణాలు. 

కరోనా వైరస్ తీవ్రంగా ఉందనే విషయం తమకు తెలుసని, కానీ తాము ప్రకృతిని ఆస్వాదించలేని పరిస్థితిలో తామున్నామని అంటోంది 11 సంవత్సరాల కుమార్తె ఉన్న తల్లి కియావో. బెజ్లింగ్‌లో ఎంతో సుందరమైన ప్రదేశాలున్నాయి. వీటిని ఫొటో బంధించడానికి పోటీ పడుతుంటారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు. తాను ఒకప్పుడు ఫొటోలు తీసే వాడినని, వైరస్ కారణంగా బయటకు వెళ్లలేకపోతున్నానని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 

షాపింగ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన వాంగ్ పుజింగ్ వీధులు సాధారణంగా రద్దీగా ఉండేదని..కానీ ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపో్యాయి. పర్యాటకుల కంటే..ఎక్కువగా ఆయా ప్రదేశాల్లో సెక్యూర్టీ గార్డులు, స్ట్రీట్ క్లీనర్లు కనిపిస్తున్నారని ఓ వ్యక్తి వెల్లడించారు. వైరస్‌ని అరికట్టే ప్రయత్నంలో సామూహిక సమావేశాలు, భోజనాలు చేయడాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో షాప్‌లు బార్‌లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.

భోజనం తినడానికి క్యూలో నిల్చేన వారని..కానీ ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే భోజనానికి వస్తున్నారని ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు తెలిపారు. ప్రస్తుతం తమ పరిస్థితి ఏంటీ అని వీరంతా ఆలోచిస్తున్నారు. ఈ వైరస్ ధాటికి చైనాలో దాదాపు 722 మంది చనిపోయారు. దాదాపు 32 వేల మందికి ఈ వైరస్ సోకింది. హుబీ ప్రావిన్స్‌లో మూడొంతుల కేసులు నమోదయ్యాయి.