G20 family photo: ఫొటో దిగి వెళ్లి.. బైడెన్‌ వల్ల తిరిగి వచ్చి మళ్లీ ఫొటో దిగారు.. ఏం జరిగిందంటే?

జీ20 సదస్సు బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతోంది.

G20 family photo: ఫొటో దిగి వెళ్లి.. బైడెన్‌ వల్ల తిరిగి వచ్చి మళ్లీ ఫొటో దిగారు.. ఏం జరిగిందంటే?

Updated On : November 20, 2024 / 9:22 AM IST

జీ20 సదస్సుకు వచ్చిన ప్రపంచ అధినేతలు ఫొటో దిగిన వేళ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మంగళవారం వారంతా ఫొటో దిగగా అందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కనపడలేదన్న విషయం తెలిసిందే.

ఆ ఫొటోను త్వరగా తీయడంతో బైడెన్‌తో పాటు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని మెలోనీ కూడా అందుకు అందుబాటులో లేకుండాపోయారు. వారంతా ఆలస్యంగా ఫొటో షూట్‌కి వచ్చారు.

దీంతో ఫొటోలో బైడెన్‌ లేరేంటి? అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆ ఫొటో వైరల్ అయింది. అయితే, ఫొటో సెషన్ ముగిశాక బైడెన్‌ అక్కడకు వచ్చి ప్రపంచ అధినేతలతో మాట్లాడి అప్పుడు ఫొటోకి పోజులు ఇవ్వడం గమనార్హం.

ఈ సారి ఈ ఫొటోలో బైడెన్‌తో పాటు ట్రూడో, మెలోనీ కూడా కనపడ్డారు. జీ20 సదస్సు బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతోంది. మొదటిసారి ప్రపంచ అధినేతలు దిగిన ఫొటోలో మొదటి రోలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, మరికొందరు ఉన్నారు.

రెండోసారి దిగిన ఫొటోలో వారితో పాటు బైడెన్‌ కూడా కనపడ్డారు. మొదటిసారి బైడెన్‌ లేకుండా దిగిన ఫొటో.. ఆ తర్వాత దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

బైడెన్‌ రాక ముందు దిగిన అధికారిక ఫొటో ఇదే..

Gold Rates: దేశంలో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు