Venezuela Prison :ఓరి నాయనో.. ఆ జైలులో బిట్‌కాయిన్ మిషన్లు, బకెట్ల కొద్దీ బులెట్లు, మెషీన్ గన్ బులెట్ బెల్టులు ఇంకా మరెన్నో.!
అదొక జైలు. కానీ జైలులా లేదు. ఖైదీలు గంజాయి, కొకైన్ లతో భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటారు. బిట్ కాయిన్లు తయారు చేస్తుంటారు.తుపాకులతో విన్యాసాలు చేస్తుంటారు. జైల్లోనే ఖైదీలు గ్రేనేడ్లతో బంతాట ఆడుకుంటుంటారు. మారణాయుధాలు పక్కనే పెట్టుకుని పడుకుంటారు ఆ జైలును ఓ ఆయుధ కర్మాగారంలా..ఓ జూలా, ఓ ప్లే గ్రౌండ్ లా మార్చేసింది ఓ ముఠా.

Bitcoin machines In Venezuela Prison
Bitcoin machines In Venezuela Prison : అదొక జైలు. కానీ జైలులా లేదు. ఏదో ఓ ఫ్యాక్టరీలా,ఓ జూలా, ఆయుధ కర్మాగారంలా మారిపోయింది. ఆ జైలులో తుపాకులు,మెషీన్ గన్ బులెట్ బెల్టులు,రైఫిల్స్,రాకెట్ లాంచర్లు,బిట్‌కాయిన్ మైనింగ్ మెషీన్లు,కొకైన్, గంజాయి ఇలా అక్కడ కనిపించే దృశ్యాలు చూస్తే అది జైలు అనుకునేలా ఏదీ లేదు. ఏదో ఆయుధ కారాగారంలా,బిట్ కాయిన్లు తయారు చేసే ఫ్యాక్టరీలా, గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్ధాలు సరఫరా చేసే గోడౌన్ లా ఇలా అన్ని విధ్వంసాలకు కేంద్రంలా మారిపోయింది వెనిజులాలోని ఓ జైలు(Venezuela Prison).
ఆయుధ కర్మాగారంలా..మత్తుపదార్దాలకు కేంద్రంగా జైలు..
అది వెనిజులాలోని పెద్ద టోకోరన్ జైలు(Tocoron prison). ఆ జైలులో ఓ ముఠా ఆధిపత్యం చెలాయిస్తు జైలును తమ ఇష్టారాజ్యంగా మార్చేసింది. ఆ ముఠా ఆట కట్టించటానికి వేలాదిమంది పోలీసులు, సైకులతో సహా రంగంలోకి దిగారు. యుద్ధం ట్యాంకులు, ఆయుధ వాహనాలతో రంగంలోకి దిగారు. ఏడాదికపైకి ప్లాన్ వేసి ఎట్టకేలకు జైలుపై దాడికి దిగారు. 11,000మంది పోలీసులు, వందలాదిమంది సైనికులు ట్యాంకులు, సాయుధ వాహనాలతో పెద్ద టోకోరన్ జైలుపై దాడి చేయటంతో ఆ జైలులో జరుగుతున్న అరాచాలు బయటపడ్డాయి. వెనిజులాలోని ఓ జైలు నుంచి బిట్ కాయిన్ మైనింగ్ మెషీన్లు, రాకెట్ లాంచర్లు, గంజాయి, కొకైన్,పేలుడు పదార్ధాలు, తుపాకులు ఇలా ఒకటేమిటి ఎన్నో బయటపడటంతో పెను సంచలనంగా మారింది.
ట్రెన్ డి అరగువా ముఠాకు కేంద్రంగా జైలు..
జైలు గదిని..జైలులోని స్థలాన్ని ఆటస్థలంగా, నైట్ క్లబ్‌గా, జూగా మార్చేసింది ఓ ముఠా. ఈ జైలుపై భారీ సంఖ్యలో పోలీసులు, సైకికులతో సహా దాడి చేయగా జైలులో జరుగుతున్నా అత్యంత భయానక దారుణాలన్ని బయటపడ్డాయి. నుంచి వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ దాడిలో జైలులో ఓ ముఠా చేస్తున్న దారుణాలన్ని బయటపడ్డాయి. వెనిజులా, లాటిన్ అమెరికా దేశాల్లో ( Latin American countries)కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రెన్ డి అరగువా ముఠా(Tren de Aragua gang)కు ప్రధాన కార్యాలయంగా ఈ జైలు మారిపోయింది.పోలీసులు, సైనికులు ట్యాంకులు, సాయుధ వాహనాలతో జైలులో జరిపిన ఆపరేషన్ లో ఓ సైనికుడు మృతి చెందాడు. ఈ ఆపరేషన్ కు పోలీసు యంత్రాంగం, సైనికులు కలిసి ఏడాదికిపైగా ప్లాన్ చేసి నిర్వహించారు. ఈ విషయాన్ని స్వయంగా వెనిజులా న్యాయశాఖ మంత్రి రెమిగియో సెబాలస్ (Justice Minister Remigio Ceballos)వెల్లడించారు.
భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో జైల్లోనే ఎంజాయ్ చేస్తున్న ఖైదీలు..
జైలు గగుద్లో స్నిపర్ రైఫిల్స్, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్లు, గ్రేనేడ్లతోపాటు కొకైన్, గంజాయి, ఖరీదైన టూవర్లు ఇంకా మరెన్నో నిండిపోయి ఉన్నాయి. వాటన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు సాధారణంగా జైలులో ఖైదీలు మాత్రమే ఉంటారు. వారి బంధువులు ఖైదీలను కలవాలంటే ములాఖత్ ద్వారా మాత్రమే మీట్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈజైలులో అలా కాదు ఏకంగా ఖైదీలు వారి గదుల్లో తమ భార్యలతో సహా కలిసి కాపురం చేస్తున్నారు. అంతేకాదు వారి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలా ఆజైలును ఎలా చూసిన ఎక్కడ చూసినా ఏమాత్రం జైలులా కనిపించదు.
వేలాది పోలీసులు, సైనికులు సాయుధ వాహనాలతో సహా జైలుమీద దాడి..
వేలాదిమంది పోలీసు బలగాలు, సైనికులు సాయుధ వాహనాలతో సహా జైలుమీద దాడి చేయాల్సి వచ్చింది. అలా జైలు నుంచి స్వాధీనం చేసుకున్న వాటిని మీడియా ముందు ప్రదర్శింటంతో వెనిజులాయే కాదు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అది అసలు జైలేనా..? అనేలా ఉంది. స్వాధీనం చేసుకున్నవాటిలో బకెట్ల కొద్దీ బులెట్లు, మెషీన్ గన్ బులెట్ బెల్టులు, క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్లు తయారు చేసే మిషన్లు ,గంజాయి, కొకైన్ ప్యాకెట్లు, టీవీలు, మైక్రోవేవ్‌లు, ఏసీలుఒకటేమిటి ఓ విధ్వంసకర ప్రపంచమే ఆజైలులో కొలువుతీరిందని తెలుస్తోంది.
జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..
ఓ గ్యాంగ్ జైలుపై సాగించిన ఆధిపత్యానికి ఈ దాడులతో అంతమైంది. ఈ దాడులు జరుగుతున్న క్రమంలో దాడులకు నిరసనగా ఖైదీలు ఏకంగా కొన్ని చోట్ల నిప్పు పెట్టేశారు. నిప్పు అంటించడంతో కొన్ని జంతువులు చనిపోయాయని తెలిపారు మంత్రి. ఈ దారుణాలకు కారణమైన ఖైదీల గాంగ్ కు జైలులోని కొంతమంది పోలీసులు సహకరించారు. వారిని అరెస్ట్ చేశారు.