బలూచిస్తాన్ లోని హోటల్ పై ఉగ్రదాడి

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2019 / 03:36 PM IST
బలూచిస్తాన్ లోని హోటల్ పై ఉగ్రదాడి

Updated On : May 11, 2019 / 3:36 PM IST

పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్‌ సిటీలోని పెరల్‌ కాంటినెంటల్‌ హోటల్‌ లోకి ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడ్డారని పాక్‌ మీడియా తెలిపింది.గ్వాదర్‌లో సముద్ర తీరానికి సమీపంలోని ఓ కొండపై ఈ హోటల్‌ ఉంది. హోటల్ లోపలి నుంచి తుపాకీ పేల్చిన చప్పుళ్లు కూడా వినిపించినట్లు తెలిపింది. పోలీసులతో సహా ఉగ్రవాద నిరోధక దళం,ఆర్మీ జవాన్లు హోటల్‌ ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. 

శనివారం సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు హోటల్‌లోకి చొరబడ్డట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో హోటల్‌ లో విదేశీయులెవరూ లేరని, దాదాపు 95 శాతం మందిని హోటల్‌ నుంచి బయటకు రప్పించేశామని వెల్లడించారు. ఉగ్రవాదులు ఇంకా హోటల్‌ లోనే ఉన్నారని తెలిపారు. హోటల్ సెక్యూరిటీ గార్డ్ ఒకరు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినట్లు తెలిపారు.ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది.