Blinken arrives in Beijing: బీజింగ్‌కు వచ్చిన బ్లింకెన్..ఐదేళ్లలో మొదటిసారి చైనా వచ్చిన యూఎస్ దౌత్యవేత్త

అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం చైనా దేశ రాజధాని బీజింగ్ నగరానికి చేరుకున్నారు.2018వ సంవత్సరం నుంచి గడచిన ఐదేళ్లలో మొట్టమొదటిసారి అమెరికా దౌత్యవేత్త చైనా దేశాన్ని సందర్శిస్తున్నారు....

Blinken arrives in Beijing: బీజింగ్‌కు వచ్చిన బ్లింకెన్..ఐదేళ్లలో మొదటిసారి చైనా వచ్చిన యూఎస్ దౌత్యవేత్త

బీజింగ్ కు వచ్చిన బ్లింకెన్

Blinken arrives in Beijing: అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం చైనా దేశ రాజధాని బీజింగ్ నగరానికి చేరుకున్నారు.2018వ సంవత్సరం నుంచి గడచిన ఐదేళ్లలో మొట్టమొదటిసారి అమెరికా దౌత్యవేత్త చైనా దేశాన్ని సందర్శిస్తున్నారు.(first US State Secretary to visit)ప్రత్యర్థి శక్తుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు.

Five earthquakes jolt Jammu and Kashmir: కశ్మీరులో కలకలం..24 గంటల్లో ఐదు భూకంపాలు

వాణిజ్యం నుంచి సాంకేతికత,ప్రాంతీయ భద్రత వరకు పలు సమస్యలపై ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు విభేదిస్తున్న నేపథ్యంలో బ్లింకెన్ రెండు రోజుల పర్యటన ఆసక్తికరంగా మారింది. గత ఏడాది నవంబర్‌ నెలలో బాలిలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా అధినేత జిన్‌పింగ్ ల మధ్య స్నేహపూర్వక శిఖరాగ్ర సమావేశం ఫలించింది.

Aircraft Crashes In France: ఫ్రాన్స్‌లో కూలిన ఆర్మీ విమానం..ముగ్గురి సైనికుల మృతి

వాస్తవానికి బ్లింకెన్ చైనా పర్యటన నాలుగు నెలల క్రితం ఉంది.కాని అమెరికా గడ్డపై చైనీస్ గూఢచారి బెలూన్‌ను గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ చెప్పడంతో అప్పట్లో బ్లింకెన్ పర్యటన అకస్మాత్తుగా వాయిదా పడింది. యునైటెడ్ స్టేట్స్ చైనా దేశ ప్రధాన ఆందోళనలను గౌరవించాలని, బీజింగ్‌తో కలిసి పని చేయాలని బ్లింకెన్ పర్యటనకు ముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ కోరారు.మొత్తంమీద అమెరికా దౌత్యవేత్త చైనా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.