విరగిపడ్డ  కొండచరియలు : 11మంది మృతి 

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 05:02 AM IST
విరగిపడ్డ  కొండచరియలు : 11మంది మృతి 

Updated On : February 5, 2019 / 5:02 AM IST

బొలీవియా: బొలీవియాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని లా పాజ్ వాయువ్య దిశలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఫిబ్రవరి 2న ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలపై మీద కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా మట్టిదిబ్బలు విరిగిపడడంతో అదుపుతప్పిన ఓ వాహనం 600 అడుగుల లోతులో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థాలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. ఈ క్రమంలో వర్షాల కారణంగా సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. మృతదేహాలను విపత్తు బృందాలు ఈ రోజు (ఫిబ్రవరి 5)న  వెలికితీశాయి. ప్రమాదంలో 11మంది మృతి చెందగా..మరో మరో 18 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.ఆఘటనలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్న అధికారులు..  వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడతుందంటున్నారు.