ఆఫ్ఘనిస్తాన్‌లో జంట పేలుళ్లు…17మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : November 25, 2020 / 01:50 AM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో జంట పేలుళ్లు…17మంది మృతి

Updated On : November 25, 2020 / 7:35 AM IST

Afghanistan’s Bamyan province ఆఫ్ఘనిస్తాన్‌లోని బమియాన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది మరణించారు. మరో 59 మంది గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల తెలిపిన ప్రకారం..స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల సమయంలో బామియన్ నగరంలోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు సంభవించాయి.



ఆఫ్ఘనిస్తాన్‌లో బమియన్ అత్యంత సురక్షితమైన ప్రావిన్సులలో ఒకటిగా పరిగణిస్తారు. బమియాన్… 2001 లో ఉగ్రవాదులు పేల్చిన బుద్ధ విగ్రహాలకు నిలయం. కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క సురక్షితమైన ప్రావిన్స్‌గా పరిగణించబడుతుంది.

ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశం ఇది. గత ఏడాది 4లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇందులో 400 మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. బమియాన్ ప్రాంతంలో ఈ పేలుళ్లు సంవించడం ఇదే తొలిసారి. అయితే, పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.



ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రాంతీయ సహకారంపై జరిగిన సమావేశంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘని మాట్లాడుతూ స్థిరమైన శాంతిని నెలకొల్పడానికి బలమైన ప్రాంతీయ ఏకాభిప్రాయం అవసరమని పునరుద్ఘాటించిన సమయంలో ఈ జంట పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది.



మరోవైపు,కొద్ధి నెలల క్రితం ఖతార్ రాజధాని దోహాలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరియు తాలిబన్లు ప్రత్యక్ష చర్చల కోసం మొదటిసారి సమావేశమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా హింస పెరుగుతోంది.