Football Legendary Pele Passed Away : సాకర్ దిగ్గజం పీలే ఇక లేరు.. క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూత
బ్రెజిల్ సాకర్ దిగ్గజం, ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) ఇక లేరు. అనారోగ్యం బాధపడుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీలే మృతి చెందారు.

PELE DIED
Football Legendary Pele Passed Away : బ్రెజిల్ సాకర్ దిగ్గజం, ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) ఇక లేరు. అనారోగ్యం బాధపడుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీలే మృతి చెందారు. గత కొంతకాలంగా పీలే క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని పీలే కూతురు దృవీకరించారు.
క్యాన్సర్ బారిన పడిన పీలేకు గత ఏడాది సెప్టెంబర్ లో వైద్యులు పెద్దపేగులో క్యాన్సర్ కణతిని తొలగించారు. అప్పటి నుంచి ఆయనకు కీమో థెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పీలేకు ఊపరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. పీలే పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
PM Modi’s Mother Passed Away : ప్రధాని మోదీకి మాతృ వియోగం.. అనారోగ్యంతో హీరాబెన్ కన్నుమూత
అక్టోబర్23, 1940లో పీలే జన్మించారు. బ్రెజిలో లోని ట్రెస్ కొరాకోస్ లో ఆయన జన్మించారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. సాకర్ చరిత్రలో ఓ దిగ్గజ ఆటాగాడిగా వెలుగొందాడు. ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పీలేకు పేరుంది. బ్రెజిల్ తరపున నాలుగు సార్లు ఫుట్ బాల్ ప్రపంచ కప్ ల్లో పీలే ప్రాతినిధ్య వహించారు.
1958,1962,1970 ప్రపంచకప్ విజయాల్లో ఆయన భాగస్వామి అయ్యారు. ఫార్వర్డ్ గా, అటాకింగ్ మిడ్ ఫీల్డర్ గా మైదానంలో పీలే విన్యాసాలు అసాధారణమైనవని చెప్పవచ్చు. ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడిన 14 మ్యాచుల్లో పీలే 12 గోల్స్ సాధించారు. 1971 జులైలో యుగోస్లేవియాతో ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. రెండు దశాబ్ధాల పాటు సాకర్ ప్రేమికులను పీలే ఉర్రూతలూగించారు.