Cairn : కీలక నిర్ణయం.. 1 బిలియన్ రీఫండ్ ఆఫర్‌కు, భారత్‌పై కేసుల ఉపసంహరణకు అంగీకారం

యూకే బేస్డ్ కెయిర్న్ ఎనర్జీ పీఎల్‌సీ కీలక ప్రకటన చేసింది. పలు దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. రెట్రాస్పెక్టివ

Cairn : కీలక నిర్ణయం.. 1 బిలియన్ రీఫండ్ ఆఫర్‌కు, భారత్‌పై కేసుల ఉపసంహరణకు అంగీకారం

Cairn

Updated On : September 7, 2021 / 4:26 PM IST

Cairn : యూకే బేస్డ్ కెయిర్న్ ఎనర్జీ పీఎల్‌సీ కీలక ప్రకటన చేసింది. పలు దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం రద్దు నేపథ్యంలో 1 బిలియన్ డాలర్లు తమకు భారత ప్రభుత్వం చెల్లించిన రెండు రోజుల్లోనే ఈ కేసులను ఉపసంహరించుకుంటామని కెయిర్న్ చెప్పింది. లండన్‌లో ఉన్న కెయిర్న్ సీఈఓ సైమన్ థామ్సన్ ఈ వివరాలను తెలిపారు.

Apple Next iPhones : భారీగా పెరగనున్న ఐఫోన్ల ధరలు.. అసలు కారణం ఇదే!

వ్యాపార ఆస్తులు భారత దేశంలో ఉంటూ, వాటి యాజమాన్యం విదేశాల్లో మారితే కేపిటల్ గెయిన్స్ లెవీలను విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఓ విధానాన్ని 2012లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత నెలలో ఓ చట్టాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ చర్య సాహసోపేతమైనదని కెయిర్న్ అంది.

Whatsappలో కొత్త ఫీచర్.. మీ కాంటాక్టులను ఇక కంట్రోల్ చేయొచ్చు!

రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్‌ను అమలు చేయడం కోసం జప్తు చేసిన సొమ్మును తమకు తిరిగి ఇచ్చేయడం, అందుకు బదులుగా భారత ప్రభుత్వంపై తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం తమకు సమ్మతమేనని సైమన్ చెప్పారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించిన రెండు రోజుల్లో తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్నారు. పారిస్‌లోని దౌత్య కార్యాలయాల భవనాలను, అమెరికాలోని ఎయిరిండియా విమానాలను స్వాధీనం చేసుకోవడం కోసం పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇందుకు కెయిర్న్ షేర్ హోల్డర్లు అంగీకరించారని తెలిపారు.