లాక్‌డౌన్ టైంలో Adult కంపెనీల ప్లాస్టిక్ సెట్టింగ్

కరోనా వైరస్ మహమ్మారి ఇండస్ట్రీలన్నింటినీ మూతపడేలా చేసింది. ఆ సమయంలోనూ పనిచేసిన వారున్నారు. వర్క్ ఫ్రమ్ హోంలు చేసుకున్న వారి మాట అటుంచితే.. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా కూడా కష్టపడింది. ఇదిలా ఉంటే కొన్ని సర్వేల ప్రకారం.. లాక్‌డౌన్ సమయంలో పోర్న్ సైట్ల మీద ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందని చెప్పాయి. అలాంటప్పుడు ఇండస్ట్రీలన్నీ మూతపడటంతో ఉపాధి కోసం కొందరు అవకాశాల కోసం ఇంకొందరు ఇందులోకి దిగారు.
అన్ని దేశాల మాదిరిగానే కరోనా టైంలో బాగా దెబ్బతిన్న దేశాల్లో కొలంబియా ఒకటి. దాని నుంచి కోలుకోవడానికి ఇన్నోవేటివ్ గా, స్టాఫ్ సేఫ్ గానే ఉంచుతూ వర్క్ స్పేస్ ను కాపాడుకుంటూ పైకి రావడానికి ప్రయత్నించాయి. చాలా వరకూ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. తరచూ పరిసరాలు శుభ్రపరచుకుంటూ.. శానిటైజేషన్ కనిపిస్తూ జాగ్రత్తలు తీసుకున్నాయి.
వీటిల్లో అడల్ట్ కంపెనీలు ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా అక్కడ నేషనల్ లాక్‌డౌన్ అమలులో ఉన్నా.. వారి పనుల్లో వారే బిజీ అయిపోయారు. క్యామ్ గర్ల్స్ కు ప్లాస్టిక్ ప్యాడ్ లను ఇచ్చి ఎంటర్‌టైన్మెంట్ అందించాలని పురమాయించారు. బయటకు వెళ్లి తెచ్చుకోకుండా అక్కడే వారికి అన్నీ సెటప్ చేశారు. బెడ్ లేదా కోచ్, వెబ్ క్యామ్, లాప్ టాప్, శానిటైజర్లు వంటివన్నీ అందించారు.
ఈ ఫీల్డ్ లో ఉన్న వారికి కూడా కుటుంబం, స్నేహితులు అందరూ ఉంటారు కదా. ఇలా లాక్ డౌన్ లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచే అడల్ట్ సైట్ల కోసం పనిచేస్తే ప్రైవసీ ఇబ్బందుల్లో సరిగా వర్క్ చేయలేరని ఇలా ప్లాన్ చేశారట. ఈ అడల్డ్ కంపెనీలకు, వెబ్ సైట్లకు మంచి గిరాకీ ఉందని గత సర్వేల్లోనే తెలిసింది.