ఉత్తర అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరణ.. ఢిల్లీలో రూపొందించి తీసుకెళ్లి.. జై శ్రీరామ్‌..

ఉక్కు సూపర్‌స్ట్రక్చర్‌తో ఫైబర్‌గ్లాస్‌ను ఉపయోగించి నిర్మించారు. ఈ విగ్రహాన్ని కనీసం 100 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా, గంటకు 200 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా రూపొందించారు. 

ఉత్తర అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరణ.. ఢిల్లీలో రూపొందించి తీసుకెళ్లి.. జై శ్రీరామ్‌..

tallest Ram idol

Updated On : August 5, 2025 / 8:57 PM IST

కెనడాలోని ప్రవాస భారతీయులు ఉత్తర అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మిస్సిసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 51 అడుగుల ఎత్తున్న ఈ ఫైబర్‌గ్లాస్ విగ్రహం ఇప్పుడు టొరంటో ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా మారింది.

ఈ ప్రారంభోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కెనడా మంత్రులు రేచి వాల్డెజ్, షఫ్కత్ అలీ, మనిందర్ సిధు వంటి అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కెనడాలో సాంస్కృతిక సమైక్యతకు ప్రతీకగా నిలిచింది.

విగ్రహ ప్రత్యేకతలు  
ఈ విగ్రహాన్ని ఢిల్లీలో రూపొందించి, కెనడాలో నిపుణులైన శిల్పులు మిస్సిసాగాలోని హిందూ హెరిటేజ్ సెంటర్‌లో విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారు. పీఠం, గొడుగును మినహాయిస్తే ఈ విగ్రహం ఎత్తు 51 అడుగులు.

ఉక్కు సూపర్‌స్ట్రక్చర్‌తో ఫైబర్‌గ్లాస్‌ను ఉపయోగించి నిర్మించారు. ఈ విగ్రహాన్ని కనీసం 100 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా, గంటకు 200 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా చేశారు.

ఈ విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి గర్వకారణంగా నిలిచిందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. “అయోధ్య నుంచి ఒంటారియో వరకు శ్రీరాముని నామం సరిహద్దులు దాటింది. ఇది కేవలం విగ్రహం కాదు, విశ్వాసానికి, ఐక్యతకు ప్రతీక” అని ఒకరు వ్యాఖ్యానించారు. హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకుడు ఆచార్య సురిందర్ శర్మ శాస్త్రి మాట్లాడుతూ.. ” సమాజానికి అందించిన ఒక ఆధ్యాత్మిక కానుకే ఈ విగ్రహం” అని అన్నారు.

మిస్సిసాగాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ ఆలయం ఉండటం ఒక ప్రత్యేకత. విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రయాణికులకు కనిపించే మొట్టమొదటి దృశ్యాలలో ఈ శ్రీరాముడి విగ్రహం ఒకటి కానుంది.