Canada : భారత్లో కెనడీయన్లు జాగ్రత్తగా ఉండండి…కెనడా సలహా
భారత్-కెనడా వివాదం నేపథ్యంలో కెనడా తన దేశ పౌరులకు తాజాగా ట్రావెల్ సలహా జారీ చేసింది. భారతదేశంలోని కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా సర్కారు సూచించింది....

Canada high commission
Canada : భారత్-కెనడా వివాదం నేపథ్యంలో కెనడా తన దేశ పౌరులకు తాజాగా ట్రావెల్ సలహా జారీ చేసింది. భారతదేశంలోని కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా సర్కారు సూచించింది. (Canada updates travel advisory) ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలతో భారత్, కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.
BMW : భారత మార్కెట్లోకి కొత్తగా బీఎండబ్ల్యూ ఐ ఎక్స్1 పూర్తి ఎలక్ట్రిక్ కారు
కెనడా పట్ల సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా కెనడీయన్లు అప్రమత్తంగా ఉండాలని కెనడా సర్కారు సలహా ఇచ్చింది. (citizens in India to stay vigilant) అనంతరం న్యూఢిల్లీ భారతీయ పౌరులకు కూడా ఇదే విధమైన సలహాను జారీ చేసింది.
Next Pandemic Disease X : కొవిడ్ కంటే ఎక్స్ మహమ్మారి ప్రాణాంతకం…50 మిలియన్ల మందిని చంపగలదని అంచనా
ఒట్టావా ఒక భారతీయ అధికారిని బహిష్కరించినందుకు ప్రతిగా ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను భారత్ బహిష్కరించింది. కెనడాలో నివసిస్తున్న భారతీయ పౌరులు, విద్యార్థుల కోసం న్యూఢిల్లీ ఇదే విధమైన సలహాను జారీ చేయడంతో పాటు గత వారం చివరిలో వీసా సేవలను నిలిపివేసింది.